Ads
టెక్నాలజీ ఎంత బాగా పెరుగుతున్నా సరే పాత పద్దతులు ఇంకా అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో మారిపోతున్న సరే పూర్వ పద్ధతుల్ని అలానే అనుసరిస్తున్నారు. బాల్య వివాహాలు తప్పు అని చెప్పినా సరే ఇంకా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. నిజానికి బాల్యవివాహం చాలా తప్పు. ఆడపిల్లల్ని చదువుకోనివ్వాలి.
ఈ కాలంలో అయితే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వాళ్లకు చదువు చెప్పి మంచి ప్రోత్సాహం ఇస్తే చక్కటి బాట పడతారు. అయితే ఒక చోట బాల్య వివాహం జరిగింది. దానిని ఒక యువతి ఎంతో కష్టపడి కోర్టు వారి దృష్టికి తీసుకు వెళ్ళింది.
మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ కి చెందిన అమ్మాయి సుశీల బిష్ణోయి. ఈమెకి పన్నెండేళ్ళు ఉన్నప్పుడు తన కంటే ఆరేళ్ల పెద్ద అయిన నరేష్ తో పెళ్ళి నిశ్చయించారు. వీరి వివాహం జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి పుట్టింట్లోనే 18 ఏళ్ల వరకు ఉండాలి. 18 నిండిన తర్వాత తల్లిదండ్రులు అత్తవారింటికి తీసుకువెళ్తారు. ఈమెకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అత్త వారింటికి వెళ్లాలని ఒత్తిడి చేశారు.
Ads
ఏప్రిల్ 2016 లో సుశీల అత్తింటి నుండి వచ్చేసింది. కృతి భారతి అనే ఒక అమ్మాయి బాల్య వివాహాలని ఆపడానికి.. దాని వలన ఇబ్బంది పడే చిన్నారులకి బయటికి తీసుకు రావాలని ఒక ఎన్జీవో నడుపుతోంది. సాక్ష్యం చెప్పమని చుట్టుపక్కల వాళ్ళని అడిగింది.
ఎవరు సాక్ష్యం చెప్పడానికి అంగీకరించకపోవడంతో భర్త నరేష్ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫొటోలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2017 సెప్టెంబరు 25న జోథ్‌పూర్ కోర్టు పెళ్లిని రద్దు చేసింది. తర్వాత సుశీల 12వ తరగతి పరీక్షలు రాసి ప్యాస్ అయింది. ఆమెకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేదే లక్ష్యం.