సీనియర్ హీరోయిన్ లు ఓకే.. కానీ బాలయ్య సరసన ఈ యంగ్ హీరోయిన్ కూడా నా ?

Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు నటిస్తున్న సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుండడంతో బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. బాలయ్య బాబు అఖండ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. బాలయ్య బాబు అదే ఊపుతో బాబీ దర్శకత్వంలో ఒక చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న సినిమా 1980 నాటి కథతో రాబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అన్న విషయంపై ఇప్పటికీ ఎన్నో రకాల చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే.

Ads

ఈ నేపథ్యంలోనే ఎంతోమంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన సీనియర్ హీరోయిన్ త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అలాగే బాలయ్య – బాబీ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోందట.

ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు కూడా సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. బాలయ్య బాబు సరసన సీనియర్ హీరోయిన్లు అయితే ఓకే కానీ మరి యంగ్ హీరోయిన్లు కూడా నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకి మీనాక్షి చౌదరి కి మధ్య ఏజ్ గ్యాప్ 37 సంవత్సరాలు.

Previous articleఇండియా కొంపముంచిన అంపైర్ కాల్…! అసలు అంపైర్ కాల్ అంటే ఏంటి…?
Next articleభార్యకు బైకు నేర్పిస్తున్న భర్త.. కానీ అంతలోనే ఊహించని విధంగా అలా? చివరికి.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.