మెగాస్టార్ చిరంజీవిని సీనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ మ‌ధ్య‌లోనే తొలగించారా?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో మొదటి మాస్ హీరో ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పాలి. టాలీవుడ్ లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి, ఆడియెన్స్ ని అలరించారు.

Ads

అంతేకాకుండా తెలుగులో ఆయన దాదాపుగా అన్ని జానర్స్‌ సినిమాలలో నటించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక తెలుగులో బాలీవుడ్ రీమేక్‌ చిత్రాలను తీసి, వాటికి అప్పట్లోనే క్రేజ్‌ తెచ్చింది ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆయనకు 52ఏళ్లు ఉన్నప్పుడు ‌ ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్‌ సినిమాలో చేయగా, ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలలో ఇతర హీరోలతో కూడా నటించాడు. ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ మూవీ పేరు తిరుగులేని మనిషి. ఇందులో లాయర్ రాజాగా ఎన్టీఆర్, క్ల‌బ్‌లో పాట‌లు పాడే కిషోర్‌ పాత్రలో చిరంజీవి న‌టించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ చెల్లెలికి భర్తగా మరియు నెగిటివ్ పాత్రలో చిరంజీవి కనిపించారు. అయితే సినిమా కైమాక్స్ లో బావ ఎన్టీఆర్ తో కలిసి రౌడీల ఆటను కట్టిస్తారు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, కే దేవీ వరప్రసాద్ నిర్మాత. కేవీ మహదేవన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినీమా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి రెండు సంవత్సరాల ముందు విడుదల అయింది. ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంత‌గానో అల‌రించింది. అయితే ఒకసారి ఎన్టీఆర్ సినిమా మ‌ధ్య‌లో ఉన్నప్పుడే చిరంజీవిని ఆ సినిమా నుండి తొలగించారంట. ఎన్టీఆర్ న‌టించిన చిత్రాలలో కొండ‌వీటి సింహం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటించారు.అయితే ముందుగా మోహన్ బాబు చేసన క్యారెక్టర్ కోసం చిరంజీవిని తీసుకున్నారంట. అయితే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం చిరంజీవి ఎంచుకున్నారంట, అంతేకాకుండా ఆయన పై ఐదు రోజుల పాటు షూటింగ్ చేశారంట. ఇక చిరంజీవి, ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా డైలాగ్స్ చెప్పడంలో చాలా ఇబ్బంది పడ్డారంట. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం ముప్పై రోజులు మాత్రమే డేట్స్ కేటాయించడంతో, చిరంజీవితో షూట్ చేస్తే మూవీ లేట్ అవుతుందని భావించి మోహన్ బాబుని ఆయన పాత్ర కోసం తీసుకున్నారంట. అలా మెగాస్టార్ చిరంజీవి ఆ హిట్ మూవీ నుండి తొల‌గించ‌బ‌డ్డాడు.

Also Read: హైదరబాద్ లో ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయో తెలుసా..?

Previous articleవిద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఆ బిల్లును తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..
Next articleఏడాదికి రెండు సార్లు ఎందుకు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.