విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఆ బిల్లును తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..

Ads

ఈ మధ్యకాలంలో విద్యుత్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. బిల్లును చూస్తేనే షాక్ కొడుతున్నటు వంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు తమ ఇంటి విద్యుత్ బిల్లు తక్కువగా రావాలనే అనుకుంటారు. కానీ ప్రస్తుతం అందరి ఇంట్లో ఎక్కువగా విద్యుత్ పరికరాలు ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంది. నిపుణులు వీటిని ఉపయోగిస్తూ కూడా విద్యుత్ బిల్లు తక్కువగా వచ్చేలా చేయడం సాధ్యమే అని అంటున్నారు.

Ads

ఇంట్లో ఉపయోగించే ఫ్రిజ్‌, గీజర్‌,ఏసీ,ఒవెన్‌ లాంటి విద్యుత్‌ పరికరాలను వాడే తీరు పై ముఖ్యంగా దృష్టి పెట్టాలంటున్నారు. ఎందుకంటే యూనిట్లు పెరిగినపుడు, శ్లాబు ధర మారుతుంది. ఇక శ్లాబ్ మారిందంటే విద్యుత్ బిల్లు మోత మోగడం అయితే ఖాయం. అందుకే అలాంటి పరికరాలను ఒక పద్ధతిలో వినియోగిస్తే ఎక్కువ బిల్లులను అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రోల్ రేట్లతో కష్టాలు పడుతున్న సామాన్యప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరగడంతో మరిన్ని ఇబ్బందులను తెచ్చింది. అయితే మరి ఆ సూచనలు, సలహాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఫ్రిజ్‌ :
వాడేది ఫ్రిజ్‌ పాతది అయితే నెలకు 160 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు కాలుతుంది. అదే స్మార్ట్‌ ఫ్రిజ్‌ అయినట్టయితే అవి అవసరమయినప్పుడే ఆన్‌ అవుతాయి ఆ తరువాత ఆగిపోతాయి. దీనివల్ల కరెంటు బిల్లు తగ్గే ఛాన్సుంది. ఇక ఫ్రిజ్‌ కి, గోడకు మధ్య కొంత ప్లేస్ ఉండేలా ఉంచేటే వేడి తగ్గుతుంది. ఇక ఫ్రిజ్‌ తలుపుని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.
ఎలక్ట్రిక్ గీజర్:
ఇంట్లో గీజర్ ను వాడడం వల్ల ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. అందువల్ల కరెంట్ ను ఆదా చేయడానికి ఎలక్ట్రిక్ గీజర్‌కు బదులుగా గ్యాస్ పవర్డ్ గీజర్ అయితే బెటర్. గ్యాస్ గీజర్ కూడా ఎలక్ట్రిక్ గీజర్ లాగానే పనిచేస్తుంది. కరెంట్ ఆదా అవుతుంది.
నాన్-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్:
ఇంట్లో ఎక్కువ కరెంట్ వినియోగించే పరికరాలలో ఏసీ కూడా ఉంటుంది. అయితే, దానిని తీసివేయలేరు. కాబట్టి విద్యుత్ ను ఆదా చేయడం కోసం ఇన్వర్టర్ ఏసీని వాడవచ్చు. దీనివల్ల దాదాపుగా 15 శాతం విద్యుత్ ఆదా చేయవచ్చు.
చిమ్నీ:
సాధారణంగా వంటగదిలో చిమ్నీని ఉపయోగిస్తారు. ఇది కూడా ఎక్కువ కరెంట్ వినియోగించే పరికరాల లిస్ట్ లో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చిమ్నీకి బదులుగా వాడే అనేక ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని వాడడం వల్ల కరెంట్ ను ఆదా చేసుకోవచ్చు.
Also Read: మందు కొట్టే ముందు ”చీర్స్” అని ఎందుకు చెప్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఆ…?

Previous articleవిమానంలో ప్రయాణించే వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసా?
Next articleమెగాస్టార్ చిరంజీవిని సీనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ మ‌ధ్య‌లోనే తొలగించారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.