“ఇలాంటి సినిమా తీయడం సందీప్ రెడ్డి వంగాకి మాత్రమే సాధ్యం..!” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

Ads

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.

రణబీర్ కపూర్ లో ఇప్పటి వరకు చూడని ఒక కొత్త కోణం ఈ సినిమాలో చూపించారు అని చాలా మంది అంటున్నారు. ఒక తండ్రికి, కొడుకుకి మధ్య జరిగే గొడవలని ఈ సినిమాలో చూపించారు. ఒక కొడుకు తన తండ్రి ప్రేమ కోసం ఎంత ఆరాటపడతాడు అనే విషయాన్ని ఇందులో చూపించారు. సినిమాలో హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు.

memes on animal movie release

సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు. సినిమా డబ్బింగ్ వర్షన్స్ లో కూడా ఒరిజినల్ లాగానే అనిపించేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాకుండా హిందీలో రష్మిక కుటుంబం తెలుగు కుటుంబం అన్నట్టు చూపిస్తారు. అంటే హిందీలో వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాని పోల్చి చూస్తున్నారు. కొన్ని చోట్ల పోలికలు కూడా కనిపిస్తాయి. కానీ అర్జున్ రెడ్డిలో హీరో చిన్నవాడు అన్నట్టు చూపించారు.

animal review

ఈ సినిమాలో హీరో యంగ్ గా ఉన్నప్పటి నుండి, పెద్దవాడిగా అయిపోయేంతవరకు చూపించారు. చివరిలో ఒక హింట్ కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద సినిమా వచ్చింది లేదు ఏమో. సినిమా దాదాపు మూడున్నర గంటలు ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ సాగదీసినట్టు అనిపించాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఏదేమైనా సినిమాకి మాత్రం హిట్ టాక్ వస్తోంది. ఈ విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

Ads

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

ALSO READ : ANIMAL REVIEW : “రణబీర్ కపూర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!

Previous articleవిశాఖపట్నంలో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే..! కానీ దీని పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?
Next articleయానిమల్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?