యానిమల్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

ఎన్నో భారీ అంచనాల మధ్య రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ యానిమల్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా మీద అంచనాలు ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు.

అసలు అప్పటి వరకు దర్శకులు తెర మీద చూపించడానికి కూడా ఆలోచించే ఎన్నో విషయాలని అర్జున్ రెడ్డి సినిమాలో సందీప్ రెడ్డి చూపించారు. దీనిపై ప్రశంసలు వచ్చినట్టే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు కబీర్ సింగ్ విడుదల అయిన నాలుగు సంవత్సరాల తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన మూడవ సినిమా రిలీజ్ అయ్యింది.

actress in animal movie with ranbir kapoor

అందుకే దీని మీద ఇన్ని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. ముందుగా ఈ పాత్రకి పరిణీతి చోప్రాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయారు. దాంతో రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. రష్మిక మందన్నతో పాటు ట్రైలర్ లో కనిపించిన మరొక హీరోయిన్ గురించి కూడా సినిమా విడుదల అయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు.

actress in animal movie with ranbir kapoor

ఈ సస్పెన్స్ సినిమా వరకు ఉంచడానికి ఈ పాత్ర గురించి ఎక్కువగా ట్రైలర్ లో చూపించలేదు అని అర్థం అవుతోంది. ఆ హీరోయిన్ పేరు తృప్తి డిమ్రీ. ఈమె హిందీలో చాలా సినిమాల్లో నటించారు. 2017 లో వచ్చిన మామ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన బుల్ బుల్, కళా సినిమాలతో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు యానిమల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.

actress in animal movie with ranbir kapoor

ఈ సినిమాలో జోయా అనే పాత్రలో నటించారు. ఇప్పుడు తృప్తి 2 సినిమాల్లో నటిస్తున్నారు. యానిమల్ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పారు. ఇందులో తృప్తి కూడా నటించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఎండ్ క్రెడిట్ లో సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పే సీన్ లో తృప్తి కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో తృప్తి కనిపిస్తారు ఏమో. ఈ సినిమా పేరు యానిమల్ పార్క్ అని పెట్టారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ : “ఇలాంటి సినిమా తీయడం సందీప్ రెడ్డి వంగాకి మాత్రమే సాధ్యం..!” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

Previous article“ఇలాంటి సినిమా తీయడం సందీప్ రెడ్డి వంగాకి మాత్రమే సాధ్యం..!” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” రిలీజ్‌పై 15 మీమ్స్..!
Next article“ఇలాంటి సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” మూవీ మీద కామెంట్స్..!