Ads
పెళ్లి తర్వాత ప్రతి స్త్రీ జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండదు. ఎంత బాగా చూసుకున్నా తల్లి తండ్రి లేని లోటు తెలిసిపోతుంది. అక్కడ ఉన్న ఆనందం ఇక్కడ ఉండదు. భర్త ఎంత బాగా చూసుకున్నా సరే ఏదో ఒక దిగులు మనసులో ఉండిపోతుంది. ఇక ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మనకి భార్యా భర్తల జోక్స్ వంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
ఇటువంటి వాటిని మనం చూస్తే నవ్వు ఆపుకోలేకపోతు ఉంటాము. అలానే అత్తా కోడలు జోక్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు తన అత్తకి పంపించిన మెసేజ్ వైరల్ గా మారింది. దీనిని చూశారంటే నవ్వు ఆపుకోలేరు. మనం కొన్ని కొన్ని పనులను చూస్తే వాళ్ళు తెలియక చేసారా లేదంటే కావాలని వెటకారంగా చేశారా అనేది మనకి తెలియదు. అలా ఒక కోడలు తన అత్త కి పంపిన మెసేజ్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ మెసేజ్ చదివిన అత్తే షాక్ అయ్యింది. మీరూ షాక్ అయ్యిపోతారు చూడండి మరి.
Ads
”ఇంటి గురించి మీరేమి ఎటువంటి దిగులు పడద్దు. అన్నీ నేను చెప్పినట్టే సవ్యంగా అవుతున్నాయి. మీరేమి ఇబ్బంది పడద్దు. ఇంట్లో వంట దినుసులు ఎక్కువ రోజులు రావాలి అన్నారు. గ్యాస్ ని కూడా ఆదా చేసుకోమని చెప్పారు. అలానే చేస్తున్నాను చెప్పినట్టే. రోజుకి ఒక్క పూట మాత్రమే వంట చేసుకుంటున్నాను. మిగిలిన రెండు పూట్ల వంట చేస్తే పప్పులు, గ్యాస్ అయ్యిపోతాయని వండుకోవడం లేదు. అలానే షాపింగ్ మొత్తం నేనే చేసుకోవడం లేదు. మీ అబ్బాయికి కర్చీఫ్ కొన్నాను. మీరు చెప్పినట్టే చేస్తున్నాను.” చూసారా కోడలు మెసేజ్ కి అత్త ఎందుకు షాక్ అయ్యారని.