సైలెంట్ గా విడుదల అయిన “పృథ్వీరాజ్ సుకుమారన్” సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

Ads

కొన్ని సినిమాలు తీయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది మన తెలుగు వాళ్ళకి తెలియని విషయం కాదు. రాజమౌళి ఒక సినిమాని రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం తీస్తారు. అయితే, అంత ఎక్కువ కాలం తీసినా కూడా ప్రేక్షకులకు తృప్తిని ఇచ్చే సినిమా అందిస్తారు. “ఇది మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమాలు రాజమౌళి ఇస్తారు. రాజమౌళి లాగానే, ఒక క్వాలిటీ సినిమా తీయడానికి ఎంతో మంది దర్శకులు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు.

వారితో పాటు సినిమాలో నటించిన వారు కూడా అన్నే సంవత్సరాలు కష్టపడతారు. వారిలో స్టార్ హీరో ఇలాంటి ఒక పని చేశారు అంటే మాత్రం అది ఇంకా గొప్ప విషయంగా నిలుస్తుంది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తెలుగులో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు ఉండరు. ఇటీవల సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా చేరువ అయ్యారు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆ సినిమా ఇప్పుడు విడుదల అయ్యింది. ఆ సినిమా పేరు ది గోట్ లైఫ్. ఆడు జీవితం అనేది సినిమా క్యాప్షన్.

Ads

బ్లేస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అమలా పాల్ హీరోయిన్ గా నటించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాకి, సునీల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇంక కథ విషయానికి వస్తే, తన భార్యతో సంతోషంగా జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి, డబ్బుల కోసం దుబాయ్ వెళ్లాలి అనుకుంటాడు. తన స్నేహితుడితో కలిసి దుబాయ్ కి వెళ్ళినప్పుడు, అక్కడ ఎయిర్ పోర్ట్ లో వీళ్ళ అమాయకత్వాన్ని కనిపెట్టిన ఒక వ్యక్తి, వీళ్లిద్దరిని ఒక చోటికి తీసుకువెళ్లి తర్వాత విడదీసి, భార్య పిల్లలు ఉన్న హీరోని ఒక ఎడారిలో గొర్రెలు కాయడానికి వదిలేస్తాడు.

ఆ తర్వాత హీరో ఏం చేశాడు అనేది మిగిలిన కథ. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉన్నా కూడా, సినిమా బృందం అంతా చేసిన ప్రయత్నానికి మెచ్చుకోక తప్పదు. నటీనటుల పర్ఫార్మెన్స్, రెహమాన్ అందించిన సంగీతం, సునీల్ అందించిన ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు ఇవన్నీ కూడా టాప్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అయ్యే ప్రేక్షకులు ఈ సినిమాలో చూపించిన సీన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఒక ఎడారిలో ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చాలా వివరంగా చూపించారు. అందుకే ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా నిలుస్తుంది.

ALSO READ : “అదితి రావు హైదరీ” మొదటి భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?

Previous articleకొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తకి పంపిన మెసేజ్ ఇది… చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Next article”ప్లాస్టిక్ స్టూల్స్” కి రంధ్రం ఎందుకు ఉంటుంది..కారణం ఇదేనని తెలుసా..?