Ads
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‍తో పెళ్లి అయిన తరువాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటించిన మొదటి ప్రాజెక్ట్ మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్. లావణ్య త్రిపాఠి, బిగ్‍బాస్ 4 విజేత అభిజిత్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ నేటి నుండి డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్‌తో ఆకట్టుకున్న మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- వెబ్ సిరీస్: మిస్ పర్‌ఫెక్ట్.
- నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్, ఝాన్సీ, అభిజ్ఞ , హర్షవర్దన్, హర్ష్ రోహన్,మహేశ్ విట్టా, సునైనా తదితరుల
- దర్శకుడు: విశ్వక్ కండేరావ్
- సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారీ
- నిర్మాతలు : సుప్రియ యార్లగడ్డ
- ఓటీటీ : డిస్నీ+ హాట్‍స్టార్,
- స్ట్రీమింగ్ డేట్ : ఫిబ్రవరి 2, 2024
కథ:
మేనేజ్‍మెంట్ కన్సల్టెంట్ గా లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) ఢిల్లీలో పనిచేస్తుంది. ప్రమోషన్ రావడంతో హైదరాబాద్‍కు వస్తుంది. ఆమెకు క్లీనింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆమెకు ఓసీడీ ఉంటుంది. దాంతో అన్ని క్లీన్‍గా ఉండాలనుకుంటుంది. ఆమె ఇంట్లో పని మనిషిగా జ్యోతి (అభిజ్ఞ) చేరుతుంది. అదే ఉండే రోహిత్ (అభిజిత్) ఫ్లాట్ లో జ్యోతి పనిచేస్తూ ఉంటుంది.
లావణ్య హైదరాబాద్ కి వచ్చిన తరువాత కరోనా వల్ల లాక్‍డౌన్ అవుతుంది. దీనివల్ల లావణ్య, రోహిత్ ఇద్దరు ఒకే కంపెనీ అయినప్పటికీ వారికి తెలియదు. ఈ క్రమంలో కరోనా కారణంగా పనికి రాలేనని, దాన్ని రోహిత్‍కు కు తెలియచేయమని జ్యోతి లావణ్యకు చెబుతుంది. దీంతో లావణ్య విషయం చెప్పడానికి రోహిత్ ఫ్లాట్‍కు వెళుతుంది.
కానీ అసలు విషయం చెప్పకుండా అతని ఫ్లాట్ గందరగోళంగా ఉండడంతో అది చూడలేక క్లీన్ చేస్తుంది. అది చూసిన రోహిత్ లావణ్యను పనిమనిషిగా భావిస్తాడు. లావణ్య నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ, చెప్పలేక లక్ష్మిపేరుతో క్లీన్ చేయడానికి రోహిత్ ఇంటికి రోజు వెళుతుంటుంది. అలా రోహిత్ లవాణిని ప్రేమిస్తాడు. జ్యోతిని పనిలో నుండి తొలగిస్తాడు. లావణ్య పనిచేసే మనిషి కాదని తెలుసుకున్నాడా?ఇద్దరు ఒకే కంపెనీలో చేస్తున్న విషయం రోహిత్‍కు ఎలా తెలుసుకున్నాడు? లావణ్య రోహిత్‍ను ప్రేమించిందా? నిజం తెలిసిన తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
Ads
కరోనా లాక్ డౌన్ బ్యాక్‍డ్రాప్‍లో, ఓసీడీ కాన్సెప్ట్‌తో ప్రేమకథగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అయితే ఓసీడీ అనగానే ఆ కాన్సెప్ట్‌తో ఏడేళ్ల క్రితం దర్శకుడు మారుతీ తీసిన మహానుభావుడు సినిమా గుర్తొస్తుంది. ఆ మూవీ బాగా వర్కౌట్ అయింది. అదే కోవలో మిస్ పర్‌ఫెక్ట్ లో కామెడీ కూడా సెట్ కావాలి. కానీ ఈ సిరీస్ లో అది లోపించింది.
లావణ్య పాత్రను బాగా డిజైన్ చేసినా, అందుకు తగిన సీన్స్ రాసుకోలేదునిపిస్తుంది. సింగర్ కావడం కోసం హైదరాబాద్ వచ్చిన జ్యోతి పాత్ర, మీమర్ కావడం కోసం అతని బ్రదర్ చేసే ప్రయత్నం అంతగా నవ్వించలేదు. లావణ్య రావుగా లావణ్య పూర్తి న్యాయం చేశారు. రోహిత్ గా అభిజిత్ సెటిల్డ్ గా నటించాడు. అభిజ్ఞ నటన ఆకట్టుకుంటుంది. మహేశ్ విట్టా, సలార్ ఫేమ్ హర్ష్ రోహన్,హర్షవర్దన్, ఝాన్సీ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
ప్లస్ పాయింట్స్:
- లావణ్య త్రిపాఠి, అభిజిత్,
- కొన్ని ఫీల్ గుడ్ మూవ్‍మెంట్స్,
మైనస్ పాయింట్స్:
- లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం,
- ఇంట్రెస్టింగ్ గా సాగకపోవడం
రేటింగ్:
2/5
ఫైనల్ గా:
‘మిస్ పర్‌ఫెక్ట్’ సిరీస్ ఆశించిన విధంగా ఎంటర్‌టైనింగ్‍గా సాగకపోయినా, ఫీల్ గుడ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. ఎలాంటి అభ్యంతరకర సీన్స్ లేకపోవడంతో ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ చూడవచ్చు. అంచనాలు పెట్టుకోకుండా వీకెండ్ లో ఈ సిరీస్‍ను చూడవచ్చు.
watch trailer :