”మంగళవారం” నాడు తలస్నానం చేయకూడదా…? ఎందుకు వద్దంటారు..?

Ads

పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇది వరకు పెద్దలు చెప్పిన మాటనే వినేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తున్నారు. మన తాత తండ్రిని చూసినట్లయితే వాళ్లు వాళ్ళ పూర్వికులు చెప్పినట్లుగా పాటించేవారు.

కానీ ఈ తరం మాత్రం బాగా బిజీగా ఉండడం వలన నచ్చినట్లుగా చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా మీరు మీ పెద్దల నోట నుండి ఈ మాట విన్నారా..?

మంగళవారం నాడు తలస్నానం చేయకూడదు అని… అయితే ఎందుకు ఇలా మంగళవారం నాడు తల స్నానం చేయకూడదని చెప్తూ ఉంటారు..? దీని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చాలా సార్లు మన పెద్దలు తలస్నానం మంగళవారం చేయొద్దు అని అంటూ ఉంటారు. ఈ మధ్య చూస్తే సదుపాయాలు బాగా పెరిగాయి. పూర్వం అయితే ఇన్ని సదుపాయాలు ఉండేవి కాదు. నీళ్ల కోసం కూడా దూర ప్రాంతాలకి వెళ్లి తెచ్చుకునే వాళ్ళు. ఎన్నో మైళ్ళు వెళ్తే కానీ నీళ్లు తెచ్చుకోవడానికి అయ్యేది కాదు.

Ads

ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు నీళ్లు వచ్చేస్తున్నాయి. అయితే అప్పట్లో నీళ్ల కోసం దూర ప్రాంతాలకి వెళ్లి తెచ్చుకునే వారు కనుకే వద్దనేవాళ్ళు. పైగా ఆడవారు తలస్నానం చెయ్యడానికి ఎక్కువ నీళ్లు కావాల్సి ఉంటుంది. నీళ్ల కోసం ఈ నియమాన్ని పెట్టారు. రోజూ తలస్నానం చేసినా మంగళవారం చెయ్యకుండా ఉంటే నీటి వాడకం తగ్గించచ్చని ఇలా చెప్పారు. పైగా రోజూ తల స్నానం చేస్తే ప్రతీరోజు తల స్నానం చేస్తే తల నొప్పి , తల దిమ్ము వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులని ఆపాలని మంగళవారం నాడు తల స్నానం చేస్తే సమస్యలు రావు. అందుకే మంగళవారం తల స్నానం చెయ్యకూడదు అని నియమాన్ని తీసుకు వచ్చారు.

 

Previous articleMiss Perfect Review: హీరోయిన్ “లావణ్య త్రిపాఠి”నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?
Next articleనిద్రలో “గురక” పెడుతున్నారా..? అయితే తప్పక వీటిని ఫాలో అవ్వండి..!