డైరెక్టర్ శంకర్ రజినీ కాంత్ ‘శివాజీ’ మూవీలో ఈ చిన్న మిస్టేక్ ఎలా చేశాడబ్బా!

Ads

తెలుగు సినిపరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలంటే డైరెక్టర్ గుణ శేఖర్ గుర్తుకు వస్తారు. అదే భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ మరియు సాంకేతిక విలువలతో కూడిన సినిమాలంటే మాత్రం దర్శకుడు శంకర్ షణ్ముగం పేరే గుర్తుకు వస్తుంది.

Ads

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన ‘జెంటిల్ మెన్’ సినిమాతో ప్రారంభమైన శంకర్ సినీ కెరీర్ లో ప్రతి సినిమా విజువల్ వండర్. ఆయన స్టోరీకి తగినట్టుగా బడ్జెట్ పెట్టిస్తారు. ‘జీన్స్’ చిత్రంలో ఒక సాంగ్ లో ఏడు ప్రపంచ వింతలను చూపించాలనే శంకర్ కి ఐడియా రావడంతో అలానే ఆ సాంగ్ షూట్ చేశారు.
శంకర్ సినిమాల్లోని పాటలను ఆడియన్స్ లేవకుండా చూస్తుంటారు. ఆయన లవ్ స్టోరీస్ తో పాటుగా,  అవినీతి, లంచం లాంటి సామాజిక అంశాలు ఉండేలా స్టోరీస్ రాసుకుంటారు. ఇక ఆయన తెరకెక్కించిన  సినిమాలు వేటికవే డీఫెరెంట్ ఉంటాయి. కోలీవుడ్, టాలీవుడ్ తో పాటుగా దేశవ్యాప్తంగా డైరెక్టర్ శంకర్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ‘రోబో’ సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజివే స్వయంగా మీతో మూవీ చేయాలనుంది అని అన్నారంటే డైరెక్టర్ శంకర్ కు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం అవుతుంది.
అయితే అలాంటి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘శివాజీ’ మూవీలో చిన్న తప్పు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పోస్ట్ వైరల్ గా మారింది.  ఆ సినిమాలో విలన్ సుమన్ దృష్టిలో చనిపోయిన హీరో ఆ తర్వాత ఎన్టీ రాంగారావుగా వేరే వేషంలో వస్తాడు. ఆ సన్నివేశంలో తన పేరు  రంగారావు, అమెరికా నుండి వచ్చినట్టుగా నిరూపించడానికి రజిని కాంత్ గ్రీన్ కార్డ్ చూపిస్తాడు. ఆ కార్డ్ పైన పుట్టిన తేదీ 30/05/1974 అని ఉంటుంది.
ఇది 2010లో కార్డ్ మెంబర్ కానీ అది 2007లోనే ఎక్స్‌పైర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది గమనించిన నెటిజెన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ పై మరియు కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

Previous articleఅన్న‌మ‌య్య చిత్రంలో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర‌ను చేజార్చుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా..?
Next articleBAAK REVIEW : తమన్నా, రాశి ఖన్నా నటించిన ఈ హారర్ కామెడీ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.