Ads
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, అనసూయ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న విడుదల అయ్యింది.
Ads
ఈ సినిమా మొదట్లో డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఆ తరువాత థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. థియేటర్ రన్ అయ్యాక, ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే అక్కడా తగ్గేదేలా అనేంతగా వ్యూవ్స్ ను తెచ్చుకుంది. సినిమా డైరెక్టర్స్ చాలా కష్టపడి సినిమాలు తెరకెక్కిస్తు ఉంటారు. కొందరి సినిమాల్లో లాజిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక తెలుగులో ఉన్న దర్శకుల అందరి కంటే సుకుమార్ సినిమాలోనే ఎక్కువగా లాజిక్స్ కనిపిస్తూ ఉంటాయి.అయితే ఎంత బాగా లాజిక్స్ చూపించే డైరెక్టర్స్ అయినప్పటికి అప్పుడప్పుడు వాళ్ళు పప్పులో కాలు వేస్తారు, అలాంటి మిస్టేక్ ఒకటి పుష్ప చిత్రంలో ఉందని చర్చ జరుగుతోంది. థియేటర్లో ఎంజాయ్ చేసినవారు. ఓటీటీలో పలుసార్లు చూస్తు ఇలాంటి మిస్టేక్స్ ని పట్టుకుంటున్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మరి సుకుమార్ పుష్ప సినిమాలో ఆ చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారో కానీ, అది ఇప్పుడు ఆడియెన్స్ కు దొరికడంతో సోషల్ మీడియాలో ఈ లాజిక్ ను ఎలా మిస్సయ్యారు మాష్టారు అని మీమ్స్ ద్వారా అడుగుతున్నారు.
మరి ఆ మిస్టేక్ ఏమిటో వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీలో అల్లు అర్జున్, అతని అసిస్టెంట్ కేశవ మొదటి సారి కార్ ఎక్కుతారు. అయితే దిగడానికి కార్ డోర్ తీయడం రాక, నానా కష్టాలు పడతారు. దాంతో వేరే వ్యక్తి వచ్చి, డోర్ తీస్తాడు. ఈ సన్నివేశంలో కేశవ క్యారెక్టర్ ఎక్కువగా డోర్ తీయడానికి ఇబ్బంది పడుతుంది. కాగా ఆ తరువాత వచ్చే సన్నివేశంలో హీరోకు కు డబ్బు రావడంతో దాన్ని కేశవకు ఇచ్చి కార్ కొనుక్కుని రమ్మని పంపిస్తాడు. కేశవ డబ్బు తీసుకుని, కార్ కొని, నడుపుతూ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే దర్శకుడు సుకుమార్ లాజిక్ మిస్ అయ్యాడు. కార్ డోర్ ఓపెన్ చేయడమే రాని కేశవ, కార్ ను నడుపుకుంటు ఎలా వచ్చాడని మీమర్స్ ప్రశ్నిస్తున్నారు. వాటికి నెటిజన్లు కూడా నిజమే కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: హీరో శర్వానంద్ వివాహం చేసుకోబోయే రక్షిత రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?