Ads
ప్రపంచకప్ 2023 టోర్నీ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్లు పెట్టి ఫోటోకు ఫోజ్ ఇవ్వడం పై భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు.
వరల్డ్ కప్ గెలిచినంత మాత్రాన ట్రోఫీ పై కాళ్ళు పెడతారా అంటూ మిచెల్ మార్ష్ పై మండిపడ్డారు. మాజీ క్రికెటర్లు సైతం మిచెల్ మార్ష్ ప్రవర్తన పై విమర్శలు చేశారు. యూపీలో ఈ విషయం పై కేసు కూడా నమోదైంది. తాజాగా మిచెల్ మార్ష్ ఈ విషయం పై ఊహించని విధంగా రెస్పాండ్ అయ్యాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ వరల్డ్ కప్ 2023 గెలుచుకున్న తరువాత ఆసీసీ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. ఆరవ సారి ప్రపంచ కప్ సాధించిన సంతోషంలో ఆసీసీ ఆల్ రౌండర్ మార్ష్ హద్దుమీరీ ప్రవర్తించాడు. సంబరాల్లో మిచెల్ మార్ష్ ఒక చేత్తో బీరు బాటిల్ ను పట్టుకుని రెండు కాళ్లను ప్రపంచ కప్ ట్రోఫీ పైన పెట్టి ఫోజ్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ కప్ పై కాళ్ళు పెట్టి ఫోటోలు దిగడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అయ్యాడు. పలువురు మాజీ క్రికెటర్లు అతన్ని తప్పు పట్టారు.భారతీయ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా ఈ విషయం పై స్పందిస్తూ, ఆ ఘటన చాలా బాధించిందని వెల్లడించాడు. ఈ విషయం పై సుమారు 2 వారాల తరువాత మిచెల్ మార్ష్ రెస్పాండ్ అయ్యారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని తను అనుకోలేదని, ఆ సమయంలో అలా జరిగిపోయిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశాడు.
మిచెల్ మార్ష్ మాట్లాడుతూ “అందులో ఎలాంటి అగౌరవం కనిపించలేదు. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అది వైరల్ అయిన విషయం అందరూ చెబుతున్నప్పటికీ సోషల్ మీడియాలో దానిని పెద్దగా చూడలేదు. అందులో ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
Ads
Also Read: “గెలిచే మ్యాచ్ లో ఈ ప్లేయర్ కారణంగానే ఓడిపోయాం..!” అంటూ… “సూర్యకుమార్ యాదవ్” కామెంట్స్..! ఎవరంటే..?