Ads
కొన్ని సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సినిమా విడుదల అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ సినిమాని చూస్తూ ఉంటారు. ఆ సినిమాకి అభిమానులు కూడా పెరుగుతూ ఉంటారు. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అవుతాయి. అలాంటి సినిమాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా. 2015 లో మలయాళంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు, తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమా పేరు ఒరు వడక్కన్ సెల్ఫీ. వినీత్ శ్రీనివాసన్ రాసిన ఈ కథని, ప్రజిత్ తెరకెక్కించారు.
Ads
నివిన్ పౌలీ, మంజిమా మోహన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈ సినిమాని మేడ మీద అబ్బాయి పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో అల్లరి నరేష్, నిఖిలా విమల్ నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఉమేష్ మనోహర్ (నివిన్ పౌలీ) డైరెక్టర్ కావాలి అని కలలు కంటూ ఉంటాడు. చదువు సరిగ్గా ఎక్కదు. డైరెక్టర్ అవ్వాలి అని చెన్నైకి కూడా వెళ్ళిపోతాడు. ఒక సమయంలో డైసీ జార్జ్ (మంజిమా మోహన్) ని కలుస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా ఫస్ట్ ఒక ఫీల్ గుడ్ సినిమాలాగా మొదలు అవుతుంది.
కానీ తర్వాత తెలిసేది ఏంటంటే, ఆ సినిమా వేరే జోనర్ లో రూపొందించారు. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకి చాలా మంచి స్పందన వచ్చింది. ఎంతో మంది విమర్శకులు సినిమాని పొగిడారు. ఈ సినిమా మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. షాన్ రెహమాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా రీమేక్ హక్కులు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా కొనుక్కున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఆ భాషల్లో మాత్రం ఇంకా ఈ సినిమా రీమేక్ చేయలేదు. కానీ ఈ మలయాళం సినిమాకి మాత్రం చాలా మంది అభిమానులు ఉన్నారు.