పొలిమేర 2 బాటలో రాబోతున్న మరో సినిమా.. అదేంటంటే?

Ads

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఊరి పొలిమేర 2. గతంలో విడుదలైన మా ఊరి పొలిమేర 1 సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే మా ఊరి పొలిమేర వన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అయితే మా ఊరి పొలిమేర 2 సినిమా మాత్రం ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోకి విడుదల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇది ఇలా ఉంటే ఇప్పుడు పొలిమేర 2 సినిమా బాటలోనే మరొక సినిమా కూడా రాబోతోందట. అదే భామాకలాపం.

movie which is following the pattern of polimera

ఆహా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. వంటల వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టే గృహిణి ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం నేపథ్యంలో భామాకలాపం సినిమా సాగుతుంది. అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భామాకలాపం 2 సినిమాను థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలో మొదటి పార్ట్ రిలీజై పార్ట్ 2 ని థియేట్రికల్ రిలీజ్ చేయడం మంచి విషయమే అని చెప్పవచ్చు. ఈ విషయంలో భూమా కలాపం సినిమా పోలిమేర 2 ని ఫాలో అవుతోంది.

Ads

movie which is following the pattern of polimera

ఇక్కడ మరోసారి ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలను ఏమేరకు ఎంకరేజ్ చేస్తారన్నది తెలుస్తుంది. భామాకలాపం సినిమాలో ప్రియమణి నటించారు. భామాకలాపం 2 పోస్టర్ లో ప్రియమణి వెనక గన్నులు, వాక్యూమ్ క్లీనర్ తో కనిపించింది. అయితే మరి ఈ సినిమా కొనసాగింపు ఎలా ఉండబోతుందో చూడాలి మరి. లీడ్ రోల్స్ రాకపోయినా సరే వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వస్తున్న ప్రియమణికి భామాకలాపం 2 తో మరోసారి సోలోగా ఆడియన్స్ ని అలరించే అవకాశం వచ్చింది

Source : https://www.tupaki.com/amp/entertainment/bhamakalapam2movie-1327152

ALSO READ : చాలా టాలెంట్ ఉంది…కానీ ఈ నటుడిని మన ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అనుకుంట.?

Previous articleపవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది..!
Next articleకార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా..? కారణం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.