Ads
కొన్ని సినిమాల గురించి విడుదల అయినప్పుడు మాట్లాడుకుంటారు. కొన్ని సినిమాల గురించి విడుదల అయ్యాక మాట్లాడుకుంటారు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. అవి విడుదల అవుతాయి. తర్వాత వాటి గురించి మర్చిపోతారు. మళ్లీ ఆ సినిమాలు విడుదల అయ్యి దశాబ్దాలు గడిచిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటారు. అందుకు కారణం, ఆ సినిమాకి సంబంధించిన రిఫరెన్స్ ఇంకొక సినిమాలో వాడడం. ఇటీవల గుంటూరు కారం సినిమాలో చెప్పవే చిరుగాలి పాట రిఫరెన్స్ వాడారు. ఇంకా చాలా పాత పాటల రిఫరెన్స్ లు ఈ సినిమాలో ఉన్నాయి. దాంతో ఆ పాటల గురించి ఇప్పుడు వెతుకుతున్నారు.
ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమలేఖనే పాటని వాడారు. ఇప్పుడు ఈ పాట గురించి అందరూ మళ్లీ వెతుకుతున్నారు. అందరూ ఈ పాటని ఎక్కువగా వింటున్నారు. యూట్యూబ్ లో ఈ పాటలు వీడియోస్ కింద కూడా, “ఆ సినిమా చూసి ఈ పాట చూడడానికి వచ్చాం” అంటూ కామెంట్స్ ఉంటాయి. అలా ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల కిందట విడుదల అయిన ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు దేవరాగం. శ్రీదేవి, అరవింద్ స్వామి ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు.
Ads
అసలు వీళ్ళిద్దరూ కలిసి నటించిన కూడా ఎవరికి తెలియదు. ఇది ఒక మలయాళం సినిమా. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేశారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. కీరవాణి మలయాళం సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహించిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఏమో. ఈ సినిమాలో యా యా యా యాదవ అనే ఒక పాట ఇప్పుడు ఫేమస్ అయ్యింది. అందుకు కారణం ఇటీవల వచ్చిన ప్రేమలు సినిమాలో ఈ పాటని వాడారు. హీరోయిన్ ఈ పాటకి డాన్స్ చేస్తుంది. ఇదే పాటని తెలుగులోకి కూడా అనువాదం చేశారు. మలయాళంలో ఈ పాటని చిత్ర, ఉన్నికృష్ణన్ పాడారు. తెలుగులో ఈ పాటని చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడారు.
ఇదే పాటని తెలుగులో ప్రేమే నా ప్రాణం అనే ఒక సినిమాలో కూడా వాడారు. ఈ పాటను కూడా చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడారు. తెలుగులోకి అనువాదం చేసిన సినిమాలో ఈ పాట ఉండటం మాత్రమే కాకుండా, తెలుగులో కూడా ఒక సినిమాకి ఈ పాటని వాడారు. ప్రేమలు సినిమాలో ఈ పాటని విన్న తర్వాత అందరూ ఈ పాట కోసం వెతకడం మొదలుపెట్టారు. ప్రేమలు తెలుగు డబ్బింగ్ లో కూడా మలయాళం పాటనే వాడారు. కానీ ఇప్పుడు ఈ పాట కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఈ పాటకి రెండు తెలుగు వెర్షన్స్ ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఈ పాటల వీడియోస్ కింద, “ప్రేమలు సినిమా చూసి ఎంత మంది వచ్చారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.