ఓటు వేయడానికి వచ్చిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇలా మారిపోయారేంటి..?

Ads

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో జనాలు అందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారికి ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి ఓటు వేస్తున్నారు. కేవలం తమ ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు దూరప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.

hero who went to cast his vote

ఇవాళ జరిగే ఎన్నికల కోసం ప్రజలు వెళ్లి ఓటు వేస్తున్నారు. ఇందుకోసం ఎంతో మంది ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత మోహన్ బాబు, మంచు విష్ణు, ఇంకా చాలా మంది ప్రముఖులు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడి, ఓటు సామాన్యుడు హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. కొంత మంది హీరోలు మధ్యాహ్నం పూట వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Ads

ఈ హీరో కూడా అలాగే మధ్యాహ్నం వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఇటీవల ఒక సినిమాతో ఈ హీరో మన ముందుకి వచ్చారు, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ హీరో గెటప్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు తనని తాను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొన్ని ప్రత్యేకమైన ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇటీవల స్కై డైవింగ్ లో శిక్షణ తీసుకున్నారు. అలాగే కొన్ని స్పెషల్ ఫైటింగ్ టెక్నిక్స్ లో కూడా మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పనిమీద మహేష్ బాబుతో పాటు, రాజమౌళి కూడా బిజీగా ఉన్నారు. ఇవాళ దుబాయ్ నుండి రాజమౌళి వచ్చి ఓటు వేశారు. మహేష్ బాబు కూడా మధ్యాహ్నం వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేష్ బాబుతో పాటు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఓటు వేశారు. మహేష్ బాబు కొత్త గెటప్ చూసినవాళ్లు అందరూ కూడా రాజమౌళి సినిమా కోసం చాలా కఠినంగా ట్రైనింగ్ అవుతున్నారు అని అంటున్నారు. గెటప్ కూడా డిఫరెంట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

Previous articleఈ పాటలో జయసుధతో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?
Next article28 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది..? అసలు విషయం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.