Ads
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో, కొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలతో తెలుగు వారికి మమ్ముట్టి చాలా దగ్గర అయ్యారు. మమ్ముట్టి సినిమాలు రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంటాయి.
కొన్ని కమర్షియల్ సినిమాలు ఉన్నా కూడా దాదాపు చాలా వరకు ప్రయోగాత్మక సినిమాల వైపే మమ్ముట్టి ఆసక్తి చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇటీవల మమ్ముట్టి నటించిన ఒక్క సినిమా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా తెలుగులో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు కన్నూర్ స్క్వాడ్. కేరళలోని కన్నూర్ అనే ఒక జిల్లాలో ఈ సినిమా అంతా నడుస్తుంది. అక్కడ ఉండే ఏఎస్ఐ జార్ మార్టిన్ నలుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని నడిపిస్తూ ఉంటారు. అక్కడ పెరుగుతున్న నేరాలని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఎస్పీ రెండు బృందాలని ఏర్పాటు చేస్తారు. వారిలో జార్జ్ మార్టిన్ బృందం కూడా ఒకటి. అక్కడ ఉన్న మరొక ఎస్పీ అయిన చోళన్ ఒక రాజకీయ నాయకుడి కేసుని ఛేదించే బాధ్యతని వీరికి అప్పగిస్తాడు.
Ads
పది రోజుల్లో ఈ కేసును పరిష్కరించాలి అని వాళ్ళు కష్టపడుతున్న సమయంలో వారి బృందంలో ఒక సభ్యుడు లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తాయి. అయినా కూడా వారిని ఈ కేసు చేదించడానికి ఎన్నుకుంటారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఈ కేసు చేదించడానికి ఎందుకు ఎన్నుకున్నారు? అసలు ఆ రాజకీయ నాయకుడిని చంపింది ఎవరు? జార్జ్ మార్టిన్ ఏం చేశాడు? చంపిన వ్యక్తిని పట్టుకున్నారా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
ఇటీవల తెలుగు సినిమాల్లో వస్తున్న పెద్ద కంప్లైంట్ ఒకటే. కథానాయకులు తమ వయసుకి తగ్గ పాత్రలు చేయట్లేదు అని. ఒకవేళ చేసినా కూడా పక్కన హీరోయిన్ తప్పనిసరిగా ఉండాలి. లేదా ఇంకా ఏదైనా లిబర్టీ తీసుకోవాలి. కానీ ఈ సినిమాలో అలా ఏదీ కాకుండా తన వయసుకి తగ్గ పాత్ర మమ్ముట్టి చేశారు. మమ్ముట్టి పక్కన హీరోయిన్ కూడా లేరు.
సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా మొదటి నుండి చివరి వరకు నడిచేలాగా దర్శకుడు రూబీ వర్గీస్ రాజ్ ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా మలయాళం లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. మలయాళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా ఉంది. దాంతో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మమ్ముట్టి నటనని, సినిమా కథని మెచ్చుకుంటున్నారు.
ALSO READ : SALAAR Vs DUNKI… 2 ట్రైలర్స్ కి రెస్పాన్స్ ఒకటే..! కానీ ప్రేక్షకులకి ఏది ఎక్కువ నచ్చింది అంటే..?