Ads
నటులు అన్న తర్వాత ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యం. అయితే వారిలో కొంత మంది నటులు మాత్రం ప్రత్యేకం. కేవలం కళ్ళతో మాత్రం ఎక్స్ప్రెషన్స్ పలికిస్తారు. అలాంటి నటులు అంటే ఇండస్ట్రీలో మొదటిగా గుర్తు వచ్చే నటులు కమల్ హాసన్. ఆ తర్వాత గుర్తొచ్చే వ్యక్తి ఫహద్ ఫాజిల్. కేవలం కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికిస్తారు. కోపం, బాధ, ఆనందం, ప్రేమ ఇవన్నీ కళ్ళతో తెలియజేసే అంత గొప్ప నటుడు. మలయాళం లో ఫహద్ ఫాజిల్ చాలా పెద్ద స్టార్ హీరో. కానీ భారతదేశవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు.
ఫహద్ ఫాజిల్ నటించిన సినిమాలు అన్ని ఇతర భాషల్లో విడుదల అవ్వవు. అయినా కూడా ఆయన సినిమాలు చూస్తారు. దీన్నిబట్టి ఎంత మంది అభిమానులు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. తన పాత్రల ద్వారా యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా నటించారు. ఇటీవల వచ్చిన ఆవేశం సినిమాలో కూడా చాలా బాగా నటించారు. పాత్ర ఎలా ఉంటే దానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంటారు. అందుకే అంత గొప్ప నటుడు అయ్యారు.
Ads
అయితే, ఫహద్ ఫాజిల్ నటించిన ఒక సినిమా ఆయనని స్టార్ హీరో చేసింది. ఆ సినిమా పేరు మహేషింటే ప్రతీకారం. 2016 లో వచ్చిన ఈ సినిమా ఫహద్ ఫాజిల్ ని స్టార్ హీరోగా చేసింది. మహేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేశారు. తెలుగులో కూడా అంతే బాగా తీశారు. అంతే బాగా నటించారు కూడా. తెలుగులో సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఈ సినిమాకి రీమేక్. మలయాళం లో ఎంత బాగా ఈ సినిమాని తీసారో తెలుగులో కూడా అంతే బాగా తీశారు.
అందుకే తెలుగులో కూడా ఈ సినిమా చాలా మందికి నచ్చింది. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. అయితే ఇదే సినిమాని తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. కానీ తమిళ్ లో ఈ సినిమాలో చాలా మార్పులు చేశారు. నిమిర్ అనే పేరుతో రీమేక్ చేసిన ఈ సినిమాలో, ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. కానీ మలయాళం సినిమాకి వచ్చినంత గుర్తింపు తెలుగు రీమేక్ కి కూడా వచ్చింది. గత పది సంవత్సరాల్లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.