Ads
చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వస్తారు. కొంత మంది హీరోయిన్స్ 20 ల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వస్తారు. అయితే, వారి వయసు ఎంత అయినా సరే, తమని తాము సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలుపుకోవాలి అంటే అది కొంత మంది హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎంతో టాలెంట్ ఉండి, ఎలాంటి పాత్రలు అయినా సరే చేయగలిగే సత్తా ఉన్న హీరోయిన్స్ మాత్రమే ఎంతో కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఇది కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు. నటులకి ఉండాల్సిన విషయం ఇది.
ఇప్పుడు అంటే హీరోయిన్స్ 20 దాటాక ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ అప్పట్లో హీరోయిన్స్ స్కూల్ లో చదువుతున్న సమయంలోనే హీరోయిన్ గా చేసేవారు. కొంత మంది హీరోయిన్స్ చదువుకుంటూ హీరోయిన్ గా కూడా చేశారు. ఈ పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ కూడా టీనేజ్ లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎన్నో రకమైన పాత్రలు చేశారు. నటి రమ్యకృష్ణ తెలియని తెలుగువారు, కాదు కాదు తెలియని ఇండియన్ ఉండరు ఏమో.
Ads
ఎందుకంటే అన్ని భాషల్లో రమ్యకృష్ణ నటించారు. రమ్యకృష్ణ వెల్లై మనసు అనే ఒక తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాకి రమ్యకృష్ణ వయసు 15 సంవత్సరాలు. ఆ తర్వాత అన్ని భాషల్లో సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఆ సినిమాలో ఒక పాటలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ వేస్తారు. ఆ పాట షూట్ చేసే సమయానికి రమ్యకృష్ణ 4 నెలల గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ఒక డాన్స్ రియాలిటీ షోలో తెలిపారు.
అయినా కూడా రమ్యకృష్ణ ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సమానంగా డాన్స్ చేశారు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బాహుబలి సినిమా రమ్యకృష్ణ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జైలర్, గుంటూరు కారం సినిమాల్లో కూడా మంచి పాత్రలో నటించారు. ఒక సమయంలో సీరియల్స్ లో కూడా నటించిన రమ్యకృష్ణ, ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రం చేస్తున్నారు.