సైలెంట్ గా రిలీజ్ అయ్యి… 395 కోట్లు వసూలు చేసింది..! ఈ సినిమా గురించి తెలుసా..?

Ads

సినిమా బడ్జెట్ ఒక్కొక్కసారి తక్కువగా ఉన్నా కూడా, వచ్చే కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలు వస్తాయి. కానీ పెట్టిన బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ లాభాలు ఆ సినిమాలు చేస్తాయి. అందుకు కారణం, వాటిల్లో ఉన్న కంటెంట్. చాలా సినిమాలు అలాగే చేశాయి. ఈ సినిమా కూడా అలాగే 25 కోట్లు పెట్టి తీశారు. కానీ దాదాపు 359 కోట్లు ఈ సినిమా వసూలు చేసింది. భారతదేశమంతా గర్వపడేలా ఈ సినిమా చేసింది. ఈ సినిమా నేషనల్ అవార్డులు కూడా తెలుసుకుంది. ఊరి (URI) సినిమా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాగా విడుదల అయ్యి, తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది.

movie which won many awards

Ads

విక్కీ కౌశల్, యామి గౌతమ్ నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా ఈ సినిమాని నిర్మించారు. సినిమా మొత్తం ఐదు చాప్టర్లుగా నడుస్తుంది. దేశభక్తి మీద, నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీద ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. సైనికులు తమ కుటుంబాన్ని విడిచి వెళ్లి దేశం కోసం ఎంత పోరాడుతారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నటీనటుల నటనకి చాలా ప్రశంసలు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆడియోగ్రఫీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో ఈ సినిమా నాలుగు నేషనల్ అవార్డులను అందుకుంది.

అలాగే ఆ సంవత్సరం వచ్చిన ప్రతి సినిమా ఈవెంట్ లో ఒక్క అవార్డు అయినా ఈ సినిమా అందుకుంది. విక్కీ కౌశల్ ని స్టార్ హీరో చేసింది ఈ సినిమా. 2019 లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి కూడా బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలు అంటేనే అందరికీ అదొక రకమైన ఆసక్తి ఉంటుంది. దేశం అంటే ఎంత గౌరవిస్తారు అనేది ఈ సినిమాల్లో చూపిస్తారు. ఈ సినిమాలో ఈ విషయాన్ని చాలా బాగా చూపించడంతో అందరూ ప్రశంసించారు.

Previous articleఈరోజుల్లో కూడా ఇలాంటి హోటల్ ఉందా..? విజయవాడలో వాళ్ళకి తెలిసే ఉంటది..!
Next articleఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఉన్న యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఏ సినిమా కోసం అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.