Ads
కొన్ని సినిమాలు చాలా సాధారణమైన కాన్సెప్ట్ మీద వస్తాయి. కానీ అవి చాలా పెద్ద హిట్ అవుతాయి. కొన్ని సినిమాలు చాలా మంచి కాన్సెప్ట్ మీద వస్తాయి. కానీ ఫ్లాప్ అవుతాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సినిమా కాన్సెప్ట్ లు ప్రేక్షకులకు అర్థం కావు. దాంతో అది అర్థం చేసుకోవడానికి టైం పట్టి హిట్ టాక్ రావు. మరి కొన్ని సినిమాలు కాన్సెప్ట్ బాగున్నా కూడా టేకింగ్ పరంగా చేసిన పొరపాట్ల వల్ల సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా అలాంటిదే. హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాకి నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత సైన్ చేసిన సినిమా ఇది.
తమన్ సంగీత దర్శకత్వం. రాజేంద్ర ప్రసాద్, నదియా, నరేష్, జగపతి బాబు వంటి పెద్ద పెద్ద నటులు ఈ సినిమాలో ఉన్నారు. హీరో నవీన్ చంద్ర. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని పొందలేదు. ఆ సినిమా పేరు మిస్ ఇండియా. ఈ సినిమా పోస్టర్ వచ్చినప్పుడు ఇందులో కీర్తి సురేష్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటారు ఏమో, ఒక సాధారణ అమ్మాయి ఇలాంటి పోటీల్లో పాల్గొని విజేతగా ఎలా నిలిచింది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తారు ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా స్టోరీ మాత్రం వేరేగా ఉంటుంది.
Ads
మానస సంయుక్త అనే ఒక అమ్మాయి టీ వ్యాపారం, అది కూడా ఫారిన్ లో టీ వ్యాపారం ఎలా స్థాపించింది అనే విషయాన్ని ఇందులో చూపించారు. అందులో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. హీరోయిన్ పడే కష్టాలని సరిగ్గా చూపించలేదు. ఒక వేళ ఇవన్నీ జాగ్రత్తగా చూపించి ఉంటే చాలా మంచి సినిమా అయ్యేది. డైలాగ్స్ కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకి ఉండే సమస్యలని ఈ సినిమాలో చూపించి, అందుకు తగ్గట్టుగా కొన్ని డైలాగ్స్ కూడా రాశారు. కానీ చాలా అర్ధం కాని సీన్స్ ఉండడం అనే కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
2020 లో వచ్చిన ఈ సినిమాకి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పాటలు కొన్ని డైలాగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. మోటివేషన్ ఇచ్చేలాగా ఆ డైలాగ్స్ ఉంటాయి. కానీ టేకింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా హిట్ అయ్యేది. కాన్సెప్ట్ పరంగా కూడా సినిమా చూసిన వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది అంటూ కామెంట్స్ చేశారు.