Ads
సినిమా పరిశ్రమలో ఆగస్టు-2023 రికార్డు సృష్టించింది. ఈ నెలలో ఏకంగా 25 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక చిత్రం మాత్రమే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించగా.. మిగతావన్నీ డిజాస్టర్‌గా మిగిలిపోయాయి.
ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన క్రికెటర్ ధోనీ నిర్మాతగా తీసిన LGM డబ్బింగ్ మూవీ మాత్రం డిజాస్టర్ అవ్వడం షాకింగ్‌కి గురిచేసింది. వీటితోపాటు మొదటి వారంలో రిలీజైన మిస్టేక్, రాజుగారి కోడి పులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, దిల్ సే, హెబ్బులి, బ్లడ్ అండ్ చాక్లెట్, ప్రియమైన ప్రియ వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
తర్వాత చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళాశంకర్ భారీ అంచనాలతో రిలీజై బాక్సాపీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతోపాటు కొన్ని సన్నివేశాలు చిరంజీవి ఇమేజ్‌ను సైతం దెబ్బతీశాయి. ఈ సినిమా అనంతరం వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’ మూవీ అదరగొట్టింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.550 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Ads
విడుదల కంటే ముందు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. కానీ తర్వాత వచ్చిన భూతాల బంగ్లా, ప్రేమ్ కుమార్, జిలేబి, మదిలో మది, పిజ్జా-3 లాంటి సినిమాలు కొంత పర్వాలేదనిపించాయి. ఇటీవల కింగ్ ఆఫ్ కొత్త, దక్ష, రెంట్, గాండీవధారి అర్జున, బెదురులంక, బాయ్స్ హాస్టల్, ఏం చేస్తున్నావ్, నేనేనా వంటి సినిమాలు రిలీజ్ వచ్చి పోయాయి. వీటిలో వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన గాండీవధారి అర్జున సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఆగస్టులో విడుదలైన సినిమాల్లో డబ్బింగ్ మూవీ జైలర్ మాత్రమే ఆకట్టుకుందని చెప్పవచ్చు.
ALSO READ : “బేబీ”తో వైష్ణవి దశ తిరిగిపోయిందిగా.? ఏకంగా ఆ రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలు.!