“బేబీ”తో వైష్ణవి దశ తిరిగిపోయిందిగా.? ఏకంగా ఆ రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలు.!

Ads

సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఊహించని స్థాయికి ఓవర్ నైట్ ఎదిగిన నటి వైష్ణవి చైతన్. బేబీ సినిమాతో ఆమెకి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది వైష్ణవి అన్నంత నేమ్ తెచ్చింది బేబీ మూవీ. ఈ ఒక్క సినిమా సక్సెస్ అప్పటివరకు ఆమె అడ్రస్ ఏమి మర్చిపోయినట్టు తిరుగుతున్న ఆఫర్లన్నీ వెతుక్కుంటూ ఇంటి గుమ్మం వద్ద పడిగాపులు పడుతున్నాయి.

vaishnavi chaitanya upcoming movies

Ads

అయితే ఇప్పుడిప్పుడే సక్సెస్ చూస్తున్న మిగిలిన హీరోయిన్ల వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పుకోవడానికి వైష్ణవి రెడీగా లేదు. తన కెరీర్ కి ఉపయోగపడే విధంగా ఉండే కథలని ఏరి కోరి ఎంచుకుంటూ వస్తుందట. సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ప్రస్తుతం వైష్ణవి రెండు పెద్ద బ్యానర్లతో చిత్రాలకు కమిట్‌ అయింది. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చిత్రం చేయబోతోంది అని సమాచారం. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహించనున్నారు.

vaishnavi chaitanya upcoming movies

అలాగే దిల్ రాజ్ బ్యానర్ లో రౌడీ బాయ్స్ మూవీ హీరో ఆశిష్ రెడ్డి సరసన వైష్ణవి నటించబోయే మరొక సినిమా చేస్తుంది. ఈ మూవీకి ను అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్నారు. పెద్ద బ్యానర్లతో చేస్తున్న మూవీస్ కావడంతో ఈ రెండు క్లిక్ అయితే ఇక వైష్ణవి చిన్న తరహా హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ …. త్వరగానే అయిపోతుంది.

Previous articleఒకప్పటి ఈటీవీ “పటాస్ ప్రియ” గుర్తుందా.? ఇప్పుడు ఆమె పేరు మార్చుకొని బిగ్ బాస్ లో.?
Next articleచాణక్య నీతి ప్రకారం…ఈ 4 ఉంటే భార్యాభర్తలు ఎప్పటికి ఆనందంగా ఉండలేరు..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.