స్వతంత్ర అభ్యర్థిగా అనకాపల్లి స్థానం నుంచి ఎంవీఆర్… రసవత్తరంగా పోటీ!

Ads

ఏపీ రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీ స్థానాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి కన్ను పడింది. అక్కడ లోకల్‌గా ఎంవీఆర్‌కు ఉన్న బ్రాండ్‌ను అన్ని పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త..ఎంవీఆర్ గ్రూపు సంస్థల అధినేత ఎంవీఆర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నారు.. గత రెండు దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ఎంవీఆర్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖాయం అయినట్లే.. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదు.. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం..

mvr to contest from anakapally

సాధారణంగా ఎంపీ అభ్యర్థులుగా పార్టీలు పారిశ్రామికవేత్తలకే అవకాశాలు ఇస్తుంటాయి.. ఈ నేపథ్యంలో ఎంవీఆర్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నా..టికెట్ హామీ ఇస్తేనే జాయిన్ అవుతానని ఎంవీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. ఈ మేరకు రెండు పార్టీలు ఎంవీఆర్ ను బరిలో నిలబెడితే గెలుస్తాడా లేదా అని సర్వేలు కూడా నిర్వహించినట్లు సమాచారం.. అయితే ప్రధాన పార్టీల్లో ఇప్పటికే హేమాహేమీల్లాంటి అభ్యర్థులు తమకే సీటు దక్కాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఎంవీఆర్ కు కన్మర్మ్ చేసినా..ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. ఆ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని ఎంవీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

Ads

ప్రజా సేవ ద్వారా ఉత్తరాంధ్ర జనంలో ఒక హీరోలాంటి పాపులారిటీ సొంతం చేసుకున్న ఎంవీఆర్ ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. అయితే ఆయన అనుకున్న పార్టీ ..ఆయన చేరాలనుకుంటున్న పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన అభ్యర్థి నాగబాబుకు కేటాయిస్తే గనుక ఎంవీఆర్ కు ఇబ్బందే.. అయితే ఇన్నాళ్లూ ఏ పార్టీలోనూ చేరకుండా సొంతంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న ఎంవీఆర్..ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేస్తే బెటర్ అని ఆయన రాజకీయ సహచరులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది..
ఎన్నో ఏళ్లుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎంవీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.. వృద్ధులను తీర్థయాత్రలకు పంపడం..రూపాయికే భోజనం.. యువతకు ఉపాధి, విద్య, వైద్యం..ఇలా అనేక రంగాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.. అయితే ఈ మంచితనమే ఎంవీఆర్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ గెలిపిస్తుందని అంతా అనుకుంటున్నారు.

 

Previous articleఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును!.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘అరి’ పోస్టర్
Next articleకూరగాయలు తెమ్మని ఈ భార్య తన భర్తకి చీటీ ఎలా రాసిచ్చిందో చూడండి… చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.