కూరగాయలు తెమ్మని ఈ భార్య తన భర్తకి చీటీ ఎలా రాసిచ్చిందో చూడండి… చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

జోక్స్ ఎన్ని ఉన్నా.. మొగుడు పెళ్ళాల పై వచ్చే జోక్స్ కి కొదవ ఉండదు. వీటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇవి ఎప్పటికీ పాతబడవు. భార్యాభర్తలు ఒకరినొకరు తెలుసుకుని అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సరదా సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

అలాంటిదే ఇది కూడా. ఓ భార్య.. తన భర్తని కూరలు తెచ్చిపెట్టమని బజారుకి పంపిస్తుంది. అయితే.. ఆమె లిస్ట్ కూడా రాసి ఇస్తుంది. ఇందులో ఫన్ ఏమి ఉంది అని అనుకుంటున్నారా..? అసలు విషయం అందులోనే ఉంది. ఆ కూరలు ఎలా గుర్తుపట్టాలో కూడా సదరు మహిళ రాసి ఇచ్చింది.

image credits: twitter/eralondhe

ప్రస్తుతం ఈ చీటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చీటీని చూసి సదరు భర్తకి దిమ్మ తిరిగిపోయింది. ఈ చీటీని ఎవరు సోషల్ మీడియాలో పెట్టారో కానీ.. అది చూసిన వారంతా సదరు భర్త పరిస్థితిని తలచుకుని నవ్వుకుంటున్నారు. ఈ ఫోటో ఎప్పటినుంచో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ భార్య భర్త ఎవరో తెలుసా..?

పూణే కి చెందిన ఓ భర్త.. తన భార్య ఇలాంటి లిస్ట్ ఇస్తే దానిని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో అప్ లోడ్ చేసాడట. ఈ ఫోటో అప్పటినుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోను వైరల్ అవుతూనే ఉంది. ఇంతకీ ఆ భార్య భర్తల పేర్లు తెలుసుకోవాలని ఉందా..? వారి పేర్లు ఏంటంటే.. గౌరవ్, ఎరా గౌల్కర్. 2014 లోనే వీరికి పెళ్లయింది. గౌరవ్ కి కూరగాయల గురించి ఏమి తెలియదట. ఎక్కువ డబ్బులు ఇచ్చేసి తీసుకొస్తూ ఉండేవారట. దీనితో.. ఈసారి మార్కెట్ కి వెళ్ళినపుడు అతని భార్య చీటీని అలా రాసి ఇచ్చారట.

Previous articleసస్పెన్స్ మాములుగా లేదుగా.? సైలెంట్ గా ఓటీటీ లో హిట్ కొట్టేసిన ఈ సినిమా చూసారా.?
Next article”ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించిన వాళ్లెవరో మీకు తెలుసా..?