Ads
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు కూడా ఖరారు అవడంతో అన్ని పార్టీలు ప్రచారం పైనే దృష్టి పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎలెక్షన్స్ లో విజయం సాధించడం కోసం ప్రచారాలను ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి ఎలెక్షన్స్ లో ఇద్దరు అభ్యర్థులు 26 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారెవరో? ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
పాలిటిక్స్ లో యువత రావాలని ఎప్పటి నుండో నాయకులు చెబుతూ వస్తున్నారు. కొందరు నాయకుల ప్రసంగాల్లో కూడా యువత రాజకీయాలలో అడుగుపెట్టాలని చెప్పడం వింటూ ఉంటాం. యువత చట్టసభలోకి పంపడం అనేది అరుదుగా జరుగుతుంది. ఉద్యమ పార్టీగా పుట్టిన బిఆర్ఎస్(టీఆర్ఎస్), తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యమంలో పాల్గొన్న చాలామంది యువకులకు అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ ను కల్పించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వంశీ చందర్ రెడ్డికి 2014లో టికెట్ ఇచ్చింది. అలాగే ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు యువతాకు ప్రాధాన్యత ఇచ్చారు.
Ads
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికలలో ఇద్దరు 26 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు. సీనియర్ లీడర్, మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు మరియు అతని కొడుకు ఈసారి ఇద్దరు పోటీచేయాలని బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే కొడుకికి టికెట్ దొరకకపోవడంతో బీఆర్ఎస్ కి రాజీనామా చేసారు. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ మెదక్ టికెట్ రోహిత్‌కు, మల్కాజిగిరి టికెట్ హనుమంతరావుకు ఇచ్చింది. రోహిత్ కు 26 ఏళ్లు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీచేస్తున్న అభ్యర్థులందరిలో కెల్లా రోహిత్ ది అతి తక్కువ వయసు.
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరుపున హనుమాండ్ల యశస్విని రెడ్డి పోటీ చేస్తోంది. ఆమె వయసు 26 ఏళ్ళు. అయితే మైనంపల్లి రోహిత్ కన్నా యశస్విని రెడ్డి కొన్ని నెలలు పెద్దది. నిజానికి ఈ టికెట్ ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డికి కేటాయించారు. అయితే ఆమె ఎన్నారై, భారత పౌరసత్వం కోసం ఝాన్సీ రెడ్డి పెట్టిన దరఖాస్తు కదలకపోవడంతో, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆమె యశస్విని రెడ్డిని ఎలెక్షన్స్ లో నిలబెట్టారని తెలుస్తోంది.
Also Read: కేవలం రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు… తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు పెద్ద షాక్ ఇచ్చారుగా.?