అప్పుడు 19 సంవత్సరాలు నాకు…పెళ్లి ఇష్టం లేదు..! వద్దనే అన్నాను.. కానీ..?

Ads

మనకి తెలియని ఏ ప్రశ్నకైనా సరే కోరాలో సమాధానం దొరుకుతుంది ప్రపంచం మొత్తంలో ఎక్కడ నుంచి అయినా సమాధానాలు దొరికే చోటు కోరా. చాలామంది రకరకాల ప్రశ్నలు ఇక్కడ అడుగుతూ ఉంటారు వాటికి సమాధానాలను కూడా ఎంతో మంది ఇస్తూ ఉంటారు కోరాలో ”మీ పార్టనర్ పై మీకు ఉన్న ఆకర్షణ మీలో ఏ విధంగా మార్పును తీసుకొచ్చింది” అనే ప్రశ్నకి శ్వేత గార్గ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.. మరి ఆ సమాధానం మీరు కూడా చూసేయండి.

”మేము ప్రేమ పెళ్లి చేసుకోలేదు భారతీయ సంప్రదాయం ప్రకారం పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్నాము 19 సంవత్సరాలు నాకు అప్పుడు. యాక్టర్ అవ్వాలని నేను అనుకున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అందుకని పెళ్లి వద్దన్నాను. 2013లో మా అమ్మకి క్యాన్సర్ ఉందని తెలిసింది మా అమ్మ ఇక నన్ను ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్లి చేసి పంపించాలని అనుకుంది.

Ads

నా భర్తకి నాకు పదేళ్లు తేడా ఉంది. నాకు ఏమి బాగా అనిపించలేదు. నాకంటే పెద్దవాడు ఎలా అడ్జస్ట్ అవుతాను ఇలా ఎన్నో ప్రశ్నలు నాకు కలిగేవి. కానీ ఇంకో ఆప్షన్ లేదు 2013 డిసెంబర్లో మా పెళ్లి అయిపోయింది. పెళ్లికి ముందు నేను ఇంట్రావర్ట్ గా ఉండేదాన్ని. పెళ్లయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళని బాగా మిస్ అయ్యాను ఫ్యామిలీ అంటే ఏంటో అప్పుడే నాకు తెలిసింది. ప్రతి ఆదివారం నా భర్త మా ఇంటికి నన్ను తీసుకు వెళ్లేవారు నా తల్లిదండ్రులను కూడా తను బాగా చూసుకునేవారు. ఎప్పుడూ కూడా ఇంటి పనులు చెయ్యి అని ఫోర్స్ చేయలేదు.

నా భర్త మీద ప్రేమ నాకు రోజు రోజుకి పెరిగింది. కెరీర్ విషయంలో మాత్రం హ్యాపీగా లేను. ఏదో ఒకటి చేయాలని ఉండేది. సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలని అనిపించింది నా భర్త పూర్తి సపోర్టు ఇచ్చారు. 2014లో ఒక బాబు పుట్టాడు ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ లో కొంచెం మార్పు వచ్చింది. జుట్టు రాలిపోయింది అయినా కూడా నా భర్త నాతో ఎప్పుడూలానే ప్రవర్తించారు. నాకు నా భర్త నా కొడుకు ఇప్పుడు జీవితం అయిపోయారు నేను నా భర్తని ఎంతో గౌరవిస్తాను. మా ఫ్యామిలీకి మేము ఐడియల్ కపుల్. మనకి ఏది కావాలి ఏది మంచి అనేది ఒక్కోసారి మనకి తెలీదు ఈరోజు నా భర్తని నాకు లైఫ్ పార్ట్నర్ గా ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకు నేను థాంక్స్ చెప్తున్నాను. కేవలం నా భర్త మాత్రమే నన్ను హ్యాండిల్ చేయగలడు” అని చెప్పారు శ్వేత.

Previous articleతెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఎవరు..?
Next article“షమీకి గుడి కట్టినా తప్పు లేదు..!” అంటూ… సెమీ ఫైనల్ లో ఇండియా గెలవడంపై 15 మీమ్స్..!