అప్పుడు అలా వాడిన పాటని.. ఇప్పుడు సినిమాలో ఇలా పెట్టారా.? “నా పెట్టే తాళం” వెనక కథ ఇదే.!

Ads

ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆఖరికి అట్టర్ ఫ్లాప్ ని మూట కట్టుకున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో హీరో నితిన్ కాగా డైరెక్టర్ పక్కనే వంశీ. ఇద్దరు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకు కారణం చాలా రోజులుగా ఇద్దరికీ సరియైన హిట్ పడకపోవడం. ఈ సినిమా హిట్ అవడం పక్కన పెడితే ఇప్పుడు అందులో వచ్చిన ఒక పాట నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అమ్మాయిలతో ఆ స్టెప్స్ ఏంటి అంటూ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది.

నా పెట్టె తాళం తీసి అనే పాటలో బూ-తు ఎక్కువగా ఉందని అంతే కాకుండా లేడీ కానిస్టేబుల్స్ తో అది కూడా పోలీస్ స్టేషన్ లో చండాలమైన సింబాలిక్ షాట్స్ తో తీయటం పలు విమర్శలకి దారితీసింది. సినిమాలో ఈ పాట అవసరమా అంటూ చాలామంది తమ అగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇప్పటివరకు నితిన్ కి కెరియర్ పరంగా ఎలాంటి బ్యాడ్ రిమార్క్ సంపాదించుకోలేదు.అలాంటి నితిన్ ఈ సాంగ్ కి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజెన్స్ వాపోతున్నారు.

Ads

ఈ సాంగ్ లో జబర్దస్త్ కమెడియన్ సత్య శ్రీ, అలాగే విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ డాన్స్ చేశారు. అయితే ఈ పాటకి చాలా పెద్ద హిస్టరీ ఉందని చాలామందికి తెలియదు. చాలా సంవత్సరాల క్రితమే ఇది జానపద గీతంగా ప్రచారం అయింది.. అయితే రికార్డింగ్ డాన్సులు తరహాలో ప్రదర్శించడంతో డబుల్ మీనింగ్ సాంగ్ గా మారిపోయింది. ఎయిడ్స్ విజృంభిస్తున్న సమయంలో ఈ సాంగ్ ని అవేర్నెస్ క్యాంపెయినింగులో వాడటంతో ఈ సాంగ్ పూర్తిగా అ-శ్లీ-ల నాట్యాలకు మారుపేరుగా నిలిచింది.

అదే విషయాన్ని సత్య శ్రీ ఈ మధ్యనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ చేయాలి అని తెలిసినప్పుడు ఫ్యుజులు ఎగిరిపోయాయి. ఈ పాట జనాలకి వేరే విధంగా రీచ్ అవ్వదు కదా అని డాన్స్ మాస్టర్ శేఖర్ దగ్గర డైరెక్టర్ వక్కంతం వంశీ దగ్గర భయపడినట్లు చెప్పుకొచ్చింది. అయితే అలా జరగదు అని వాళ్ళిద్దరూ మాట ఇవ్వటంతో ఈ డాన్స్ చేసింది కానీ ఆమె అనుకున్నట్లే జరగడం విచారకరం. ఎందుకంటే ఈ సాంగ్ కి అశ్లీల గీతం అనే ముద్ర పడిపోయింది స్టెప్స్ కూడా అంతే అస్లీలంగా ఉన్నాయి.

Previous articleSALAAR: “సలార్” ట్రైలర్ లో ఈమెని గమనించారా.? గతంలో విలన్ గా.?
Next articleవయస్సులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రభు కూతురు…ఎంత వయసు తేడానో తెలుసా…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.