”నందమూరి తారకరత్న” అలేఖ్య ప్రేమ కథ విన్నారా..? ఇంత జరిగిందా..?

Ads

నందమూరి తారకరత్న గురించి మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నందమూరి తారక రత్న అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమా నటుడు ఈయన. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన ఎన్టీ రామారావు మనవడు. నందమూరి మోహనకృష్ణ కొడుకే తారకరత్న. ఒకే సారి 9 సినిమాలని మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు తారక రత్న. 2009లో నంది ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు కూడా ఈయనకి వచ్చింది.

నందమూరి తారకరత్న 2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్ర లో పాల్గొన్నారు.

అయితే ఆ పాదయాత్రలో కుప్పకూలి పడిపోయారు తారకరత్న. ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా ఆయన గుండెలో ఎడమవైపు 90% బ్లాక్ అయిందని అన్నారు. ఆ తర్వాత బెంగళూరు ఆస్పత్రి లో వైద్యం తీసుకున్నారు. అయితే వైద్యులు ఆయనకి మెలేనా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇదిలా ఉంటే నందమూరి తారక రత్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళ ప్రేమ కథ గురించి ఇప్పుడు చూద్దాం. తారకరత్న అలేఖ్య రెడ్డి పెళ్లి 2012లో జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డి.

Ads

స్నేహితుల ద్వారా వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడి… ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరుపక్కల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ సాయి రెడ్డి వీళ్ళ పెళ్లికి సపోర్ట్ ఇచ్చారట ఈ విషయాన్ని అలేఖ్య రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలేఖ్య ని పెళ్లి చేసుకోవడంతో తారక రత్న కుటుంబ సభ్యులు కొంతకాలం తారకరత్న ని దూరం పెట్టారు. కారణం ఏమిటంటే అలేఖ్య రెడ్డికి గతంలో ఒకసారి వివాహం అయ్యి విడాకులు అయిపోయాయి. అందుకే తారక రత్న కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు. 4 ఏళ్ల క్రితం తారక రత్న పుట్టిన రోజు నాడు అంతా ఒకటయ్యారు.

Previous article200 నుండి 100 కిలోల బరువు తగ్గిన ”అనంత్ అంబానీ”… మళ్ళీ ఎందుకు బరువు పెరిగిపోయాడు..?
Next articleభర్తకి ఎడమ వైపే భార్య ఎందుకు ఉండాలి..? దాని వెనుక ఎంతో పెద్ద కారణం వుంది..!