200 నుండి 100 కిలోల బరువు తగ్గిన ”అనంత్ అంబానీ”… మళ్ళీ ఎందుకు బరువు పెరిగిపోయాడు..?

Ads

చాలా మంది అంబానీ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. అంబానీ అంత డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ముఖేష్ అంబానీ నీతా అంబానీలకి ముగ్గురు పిల్లలు. ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇలా చిన్న కొడుకు అనంత్ అంబానీ.

ఈ మధ్యనే అనంత్ అంబానీ నిశ్చితార్థం కూడా అయింది. రాధిక మర్చంట్ తో అతని పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆమె ఎవరో కాదు అతని చిరకాల స్నేహితురాలే.

గుజరాతి సంప్రదాయం ప్రకారం ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఆ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కూడా పాల్గొన్నారు. వాళ్ల ఫొటోస్ కూడా నెట్టింట షికార్లు కొట్టాయి. అయితే అనంత్ అంబానీ గతం లో బరువు తగ్గి అందంగా కనపడ్డాడు. అయితే ఇప్పుడు మళ్లీ బాగా బరువు పెరిగి పోయాడు. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. పైగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా వేస్తున్నారు. 2016 లో 200 కిలోల బరువు ఉండేవాడు అనంత్.

Ads

అప్పుడు 200 నుండి 100 కిలోల వరకు బరువు తగ్గాడు. 200 నుండి 100 కిలోల వరకు బరువు తగ్గడం మాములు విషయం కాదు. పైగా ఇలా తగ్గడం వలన ఎంతో మందికి మోటివేషన్ కూడా ఇవ్వగలిగాడు. కానీ ఇప్పుడు మళ్లీ బరువు పెరిగిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు.

ఈ విషయంపై అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ క్లారిటీ ఇచ్చారు. అస్తమాతో అనంత్ సఫర్ అయ్యడని.. ట్రీట్మెంట్ తీసుకోగా స్టెరాయిడ్లు ఇచ్చారని.. ఆ కారణంగానే అతను మళ్ళీ బరువు పెరిగాడని అన్నారు. 5 నుంచి 6 గంటల పాటు అనంత్ వ్యాయామం చేస్తాడట. యోగ మరియు కార్డియో కి సంబందించిన వ్యాయామాలని కూడా చేస్తాడని ఆమె అంది.

Previous articleమీ ఇంట్లో గీజర్ ఉందా..? అయితే ఎట్టిపరిస్థితిలోను ఈ తప్పులని చెయ్యకండి..!
Next article”నందమూరి తారకరత్న” అలేఖ్య ప్రేమ కథ విన్నారా..? ఇంత జరిగిందా..?