Ads
‘నాటు నాటు’ పాట విడుదల అయిన దగ్గర నుండి దేశమంతట ఈ పాటకు స్టెప్పులు వేశారు. రీల్స్, షార్ట్స్, తో అదరగొట్టారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ పాట ఎంతో మందితో డాన్స్ వేయించింది. ఈ పాట అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అందుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోను అవార్డ్ ను పొందింది. తాజాగా భారతీయ సినీ పరిశ్రమ గర్వపడేలా ఆస్కార్ నామినేషన్ లోనూ నాటు నాటు పాట చోటు దక్కించుకుంది.
ఇక ఈ సాంగ్ ఐదు భాషల్లో కలిపి 20 కోట్లకు పైగా వ్యూస్ పొంది, రికార్డులను కూడా తిరగరాసింది. అయితే ఈ పాటలోని స్టెప్పులు ఇంతకు ముందు చూడనివి. వాటిని సమకూర్చింది డ్యాన్స్‌మాస్టర్ ప్రేమ్ రక్షిత్. అలా అనిఆయన లేటెస్ట్ గా వచ్చిన కొరియోగ్రాఫరేం కాదు. ఆయన డెబ్బై ఐదు సినిమాల్లో 400కు పైగా సాంగ్స్ కి డ్యాన్స్‌మాస్టర్‌గా పని చేశారు. అయితే నాటు నాటు పాటకు అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చినప్పటికి ఆ పాటకు స్టెప్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి మాత్రం తగిన గుర్తింపు ఇవ్వకపోవడం పై సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమ్ రక్షిత్ తమిళనాడులోని పుదుచ్చేరికి చెందిన కుటుంబంలో పేదరికంలో పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులలో అర్ధాకలితోనే ఆయన పెరిగాడు. ప్రేమ్ రక్షిత్ తండ్రి చెన్నై సినిమా యూనియన్‌లో మెంబర్ ఉండడంతో ఆ సంపాదనే ఆ ఫ్యామిలికి జీవనాధారం. అయితే ప్రేమ్‌కు మొదటి నుండి కూడా డ్యాన్స్ అంటే ఇష్టం అనే కంటే పిచ్చి, లేదా ప్రాణం అనవచ్చు. అప్పటికే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన సినిమా పాటలు చూస్తూ ప్రేమ్ ఏకలవ్యుడిలా ప్రాక్టీస్ చేస్తుండేవాడు.
Ads
ఇక ఆయన ఎవరి దగ్గర చేరడం గాని, నేర్చుకోవడం గాని చేయలేదు. సొంతంగా నేర్చుకున్నదే. అంతేకాకుండా తను నేర్చుకున్న కొంచెం డాన్స్ తోనే పిల్లలకు డ్యాన్స్ నేర్పేవాడు. ఆ తరువాత తన తండ్రి వల్ల ఫిల్మ్ యూనియన్‌లో కొరియోగ్రాఫర్‌గా మెంబర్ షిప్ వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ గా అవకాశాల కోసం ప్రయత్నించిన రావడం లేదు. ఇక బ్రతకడానికి ఏ దారి లేని పరిస్థితుల్లో 1993లో ఒక టైలర్ షాప్ కూడా పెట్టుకున్నాడు. అయితే వారి కుటుంబ ఆర్ధికంగా ఇంకా చితికిపోయింది. ఆ సమస్యల వలయం నుండి బయటపడే దారి కనిపించక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
ఇంట్లో చెప్పకుండా మెరీనా బీచ్ కు వెళ్లాడడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ టైమ్ లోనే తండ్రి నుండి కాల్ వచ్చింది. ఒక సినిమాకి డాన్స్ మాస్టర్ గా చేయాలని,వెంటనే ఆయన హైదరబాద్ కి వచ్చాడు. ఆ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి. ఈ చితంలో అన్ని పాటలకు ఆయనే డ్యాన్స్ మాస్టర్ గా చేశారు. రాజమౌళి ఛత్రపతి సినిమా నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొనసాగుతున్నారు. అలా మొదలైన ప్రేమ్ రక్షిత్ ప్రయాణం నేడు ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది.
Also Read: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాలలో ఆయన భార్యకు నచ్చని సినిమా ఏమిటో తెలుసా?