అంతర్జాతీయ క్రికెట్ నుండి ధోని రిటైర్ అయినా.. SA20 లో ఆడలేడు.. కారణం ఇదే..!

Ads

ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆఖరి బంతి వరకు ఐపీఎల్ మ్యాచ్ లో ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేము. ఐపీఎల్ ని చూసేందుకు కూడా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ లో ఇంకా చురుగ్గానే ఉంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు ధోని. అయితే దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 లీగ్ లో ధోని ఆడతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎస్ఏ టీ20 లో జట్లను ఐపీఎల్ ఫ్రాంఛైజ్లు కొనుగోలు చేశారు. ఎస్ఏ టీ20 లీగ్ జనవరి 10న ప్రారంభమైంది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Ads

 

ఐపీఎల్ ఆరు టీములు కూడా ఇందులో ఆడనున్నాయి. దీనిని మినీ ఇండియన్ కాంపిటీషన్ అని పిలుస్తున్నారు. ఐపీఎల్ జట్టులో చూస్తే చాలా మంది ఫారన్ ఆటగాళ్లు ఉంటారు. అయితే ఇండియన్ క్రికెటర్లు ఎస్ఏ 20 లో యాక్టివ్ గా కనబడటం లేదు. దీనికి కారణం ఏమిటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియన్ ఆటగాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. అంతర్జాతీయ క్రికెట్ నుండి ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యేంత వరకు ఆటగాళ్ళకి అనుమతి ఉండదు. ఎస్ఏ 20 కమిషనర్ గ్రేమ్ స్మిత్ ఎంఎస్ ధోని ఎస్ఏ 20 లీగ్ లో పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయాన్ని చెప్పారు.

 

ధోని వంటి అద్భుతమైన ఆటగాడు ఆడటం గర్వ కారణమని ఆయన భావిస్తున్నారు. అయితే భారత్ నుండి ఇతర లీగ్స్ లో ఆడాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటుగా ఐపిఎల్ నుండి రిటైర్ అవ్వాలి లేదంటే బీసీసీఐ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. అయితే వేరే జట్టు కి మెంటర్ గా వ్యవహరించాలన్నా కచ్చితంగా ఆరు మంది కావాలి లేదంటే బీసీసీఐ నుండి రావాల్సిన ప్రయోజనాన్ని కోల్పోతారు. రాబిన్ ఊతప్పా అన్ని ఫార్మేట్ ల నుండి రిటైర్ అయ్యారు అందుకనే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఆడుతున్నారు.

Previous articleనాటు నాటు పాట కొరియోగ్రాఫర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?
Next articleటాలీవుడ్ లో తెలంగాణ హీరోయిన్స్ కూడా ఉన్నారు.. ఆ 5 గురు హీరోయిన్స్ ఎవరో తెలుసా?