Ads
కాంతార చిత్రం ఊహించని రికార్డు సృష్టించిన తర్వాత డబ్బింగ్ చిత్రాల ప్రాముఖ్యత తెలుగులో పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విడుదలైన పలు చిత్రాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. పుష్ప చిత్రం ద్వారా తెలుగు తెరకు బాగా దగ్గరైన ఫాహద్ ఫాజిల్ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించగలిగిందో తెలుసుకుందాం.
కథ:
ఈ కథ ప్రధానంగా రాజకీయం చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తిమ్మరాజు (వడివేలు). ఒక ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి కూడా సొంతంగా పందుల వ్యాపారం చేస్తూ బతికే కొడుకు రఘువీర్ (ఉదయానిధి స్టాలిన్). ఈ తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాల మధ్య అసలు కథ మొదలవుతుంది.
లీలా అనే అమ్మాయి ప్రీ కోచింగ్ క్లాస్సెస్ నడపడం కోసం తన స్థలాన్ని సెంటర్ గా వాడుకోవడానికి ఇస్తాడు వీర. కానీ అనుకోకుండా కోచింగ్ సెంటర్ పై రౌడీలు దాడి చేస్తారు. దీని వెనుక ఆ జిల్లా పెద్ద మరియు కులం నాయకుడు అయిన రత్నవేలు హస్తం ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
నటీనటుల పనితీరు:
ఇప్పటివరకు ఒక మంచి కమీడియంలో కడుపుబ్బ నవ్వించిన వడివేలు మొదటిసారి ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఈ మూవీలో కనిపిస్తాడు. రంగమార్తాండవ చిత్రం తర్వాత బ్రహ్మానందం పై ఎటువంటి ఇమేజ్ కలిగిందో అదే ఇమేజ్ నాయకుడు చూశాక వడివేలు పై కలుగుతుంది. ఇంత మంచి నటుడు కేవలం కామెడీ జోన్ కి ఎందుకు పరిమితమయ్యాడా అన్న అనుమానం ఈ సినిమా చూసిన ఎవరికైనా రాక మానదు.
Ads
ఫహాద్ ఇప్పటివరకు నటించిన అన్ని నెగటివ్ రోల్స్ తో పోలిస్తే ఈ మూవీలో నటించిన రత్నవేలు క్యారెక్టర్ అతి క్రూరమైనది అని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్ లో అతని నటన ద బెస్ట్…మరో పక్క ఉదయానిధి స్టాలిన్ తన పాత్రకు తగినట్టు అద్భుతంగా నటించాడు.
కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. కానీ అది కాసేపు మాత్రమే…ఆ తర్వాత ఆమెకు సైడ్ క్యారెక్టర్ కి పెద్ద తేడా లేదనిపిస్తుంది.
విశ్లేషణ:
సమాజంలో నెలకొని ఉన్న జాతి వివక్ష గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రధానంగా భారత దేశంలో చాలావరకు ప్రదేశాలలో జరుగుతున్న అంశం కాబట్టి ఇది భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని మూల కథతో కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.
ప్లస్ పాయింట్స్:
వడివేలు నటన ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పవచ్చు.
నటీనటులు అందరూ తమ పాత్రకు తగినట్టుగా బ్రహ్మాండంగా నటించారు.
కుల ,జాతి వివక్షాలాంటి అంశం చుట్టూ కథ ఉండడం వల్ల చాలా మందికి కనెక్ట్ అవుతుంది.
రెహమాన్ మ్యూజిక్ మరియు సెల్వరాజ్ పర్సనల్ బ్రాండ్ మార్క్ సన్నివేశాల మూవీకి హైలైట్ గా నిలిచాయి.
మైనస్ పాయింట్స్:
చిత్రం కథనం కాస్త నేటివిటీకి దూరంగా ఉంది.
ఆర్టిస్ట్ గా చూపించిన కొన్ని సన్నివేశాలు తప్ప మిగిలినవి పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు.
అనువదించిన చిత్రం కాబట్టి.. ఇందులోని పాత్రలు తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.
చివర మాట:
పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. నాయకుడు కచ్చితంగా చూడదగిన చిత్రాలలో ఒకటి అని చెప్పవచ్చు.