“బేబీ” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

జాతీయ పురస్కారం అందుకున్న మూవీ ‘కలర్ ఫోటో’ రచయిత సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సినిమా ‘బేబీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

 • సినిమా : బేబీ
 • నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య,నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు
 • నిర్మాత : ఎస్.కె.ఎన్
 • దర్శకత్వం : సాయి రాజేష్ నీలం
 • సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్. బాల్ రెడ్డి
 • సంగీతం : విజయ్ బుల్గానిన్
 • విడుదల తేదీ: జూలై 14, 2023

స్టోరీ:

వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఒక బ‌స్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను చిన్న‌ప్ప‌టి నుంచి ప్రేమిస్తుంటుంది. ఆనంద్ కూడా ఆమె ప్రేమ‌ను ప్రేమిస్తాడు. ఆ ప్రేమ స్కూల్ రోజుల్లోనే మరింతగా పెరుగుతుంది. కానీ ఆనంద్ ప‌దవ త‌ర‌గ‌తి ఫెయిల్ అవడంతో ఆటో డ్రైవ‌ర్‌గా మారుతాడు. అయితే వైష్ణవి ఇంట‌ర్ కంప్లీట్ చేసి ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతుంది. కాలేజీలో కొత్త ప‌రిచ‌యాల కారణంగా వైష్ణ‌విలో మార్పు వస్తుంది.

ఈ క్ర‌మంలో వైష్ణ‌వి విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే క్లాస్‌మెట్‌కు దగ్గరవుతుంది. లవర్ ఆనంద్ ను దూరం పెడుతుంటుంది. ఫ్రెండ్ షిప్ గా మొదలైన వారి బంధం రొమాన్స్ వరకు వెళ్తుంతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జరిగింది? వీరిద్ద‌రి విషయం ఆనంద్‌కు తెలిసిన తరువాత అతను ఎలా స్పందించాడు? వైష్ణ‌వి ఆనంద్, విరాజ్‌ల‌లో ఎవ‌ర్ని నిజంగా ప్రేమించింది అనే తెలియాలి అంటేమూవీ చూడాల్సిందే.

రివ్యూ:

బేబీ ట్రైలర్ స్టార్టింగ్ లో ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అనే కొటేషన్ కనిపిస్తుంది. ఈ కొటేషన్ తగినట్టుగా బేబీ మూవీ క‌థ‌న‌మంతా సాగుతుంది. స్కూల్ రోజుల్లో ఒక అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ఏర్పడిన లవ్ స్టోరి. వారిద్దరు ఎదిగే క్ర‌మంలో వారి ప్రేమ కథ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? చివరికి ఏమైంది? అనేది మూవీ క‌థాంశం.

Ads

ఇలాంటి చిన్నప్పటి లవ్ స్టోరీస్ చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అయితే ఆ ప్రేమకథల్లో కాలంతోపాటు పరిణ‌తి చెంది పెళ్లి వరకు వెళ్లేవి కొన్ని మాత్ర‌మే. ఎక్కువ శాతం ప్రేమకథలు విషాదంగానే ఉంటాయి. అలాంటి ఒక సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌‘బేబీ’.హీరో ఆనంద్ దేవరకొండ గత చిత్రాల కంటే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ డైలాగ్స్ ను పలికిన విధానం బాగుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకే తన నటనతో ఆకట్టుకుంది.డీగ్లామర్ గా, పాష్ గా కనిపించినా ఆమె నటనలో ఎక్కడా తగ్గలేదు. పాటలలో కూడా వైష్ణవి హావభావాలు బాగున్నాయి. విరాజ్ అశ్విన్ పాష్ అబ్బాయిగా ఈజ్ నటించాడు. మిగిలినవారు తమ పాత్రల మేరకు నటించారు.
ఈ ప్రేమ‌క‌థ‌ను ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌ చాలా స‌హ‌జంగా రూపొందించే ప్ర‌య‌త్నం చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగ్ ఆకట్టుకుంది.నేపథ్య సంగీతంతో మూవీకి ప్రాణం పోశాడు. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మూవీకి హైలెట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రన్ టైం కాస్త ఎక్కువ అనే భావన కలిగిస్తుంది.
ప్లస్ పాయింట్స్:

 • ఆనంద్ దేవ‌ర‌కొండ‌ నటన,వైష్ణవి చైతన్య నటన
 • ఎమోషనల్ డైలాగ్స్ ,
 • ఎమోషనల్ సీన్స్,
 • సాంగ్స్
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:

 • స్లోగా సాగిన కథనం,
 • క్లైమాక్స్

రేటింగ్:

2.75/5

watch trailer :

Previous articleడిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం !
Next articleఇంతకీ ‘ నాయకుడి ‘ చిత్రం ఎలా ఉందంటే…
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.