Ads
హిందువుల పండుగ గురించి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది నాస్తికులు పండగలు జరుపుకోవడం వల్ల ఉపయోగం లేదని వాదిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక పాఠ్యాంశంలో దీపావళి పండుగ గురించి వ్యతిరేకంగా రాశారు.
దీపావళి పండుగ చాలా ఖర్చుతో కూడుకున్నదని… దీనికోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయని… దేశ రక్షణ కోసం వాడే మందు గుండు సామాగ్రి అంత వృధా అవుతుందని… దేశంలో అనేకమంది పేదవారు తిండి లేకుండా బాధపడుతున్నారని, ధనవంతులు దీపావళికి పెట్టి ఖర్చు ఆ పేదవారి తిండి కోసం ఖర్చు పెట్టాలని రాశారు.
ఇది ఏ తరగతి పుస్తకంలో రాశారో ఎక్కడ రాశారో తెలియదు కానీ…ఇది ఎవరో ఒకతను ప్రముఖ వెబ్సైట్ కొరాలో పోస్ట్ చేశారు. దీనిపైన హితేష్ మోహన్ గారు స్పందిస్తూ కామెంట్ పెట్టారు… ఎవరో మేధావి పాఠ్యాంశంలో ఈ కథను రాసుకొచ్చారు… చిన్నచిన్నగా పిల్లల మెదల్లో విషయం నింపాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. దీపావళి జరుపుకోవడం వల్ల ధనం వృధా అవుతుందంట అది ఎలానో తెలియదు మరి. మనం దీపావళికి సమానం కొంటే మన వద్ద ఉన్న డబ్బు మరొకరి దగ్గరకి వెళ్తుంది.
Ads
వారికి కూడా దీపావళి జరుపుకోవడానికి అవకాశం లభిస్తుంది. చిన్న చిన్న షాపులు వారు, దీపాలు అమ్మేవారు, మందులు అమ్మే వారు అందరూ ఈ పండుగ వల్ల లాభపడుతున్నారు. మరొక విషయం ప్రస్తావించారు దేశానికి అవసరమయ్యే ముందు నుండి సామాగ్రి వృధా అవుతుంది అంట… ఈ పాఠ్యాంశాన్ని ఆమోదించిన వాడు రాసిన వాడు కనిపిస్తే చెప్పుల దండలో సత్కారం చేయాలని ఉందని రాసుకొచ్చారు. కేవలం హిందువుల పండుగల మీద ఏడుస్తారు తప్ప మిగతా సందర్భాల్లో ముందుకుండి సామాగ్రి కాల్చేటప్పుడు మీ కళ్ళు కనపడవా అంటూ ప్రశ్నించారు.