Ads
సాధారణంగా ఏదైనా పదాలకు అర్ధాలు తెలుసుకోవాలంటే ఒకప్పుడు అయితే డిక్షనరిలో వెతికేవారు. అది అందుబాటులో లేనట్లయితే పెద్దవారిని అడిగి తెలుసుకునేవారు. అది కాదంటే గ్రామంలో ఉన్న గ్రంథాలయంలోనో, లేదా టీచర్ ను అడిగి తెలుసుకునేవారు. కానీ ప్రస్తుతం ఏది తెలుసుకోవాలన్న గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఒకరు అని కాదు అందరికి గూగుల్ తెలుసు.
Ads
ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ది చెందింది. ఇక మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ అందరికి అందుబాటులోకి వచ్చినప్పటి నుండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరు గూగుల్ లోనే వెతుకుతున్నారు. ఇక ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలన్నా, దేని గురించి అయినా సెర్చ్ చేయాలన్నా అందరికి గుర్తుకు వచ్చేది ఒక్కటే అది గూగుల్.అయితే గూగుల్ ఉంది కదా అని ఏది పడితే అది సెర్చ్ చేయడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చేతిలో ఇంటర్నెట్ ఉందని గూగుల్ లో అన్ని సెర్చ్ చేశారంటే జైలుకే అని వార్నింగ్ ఇస్తున్నారు. మరి గూగుల్ లో ఏ పదాలను వెతకకూడదో ఇప్పుడు చూద్దాం. బాంబు తయారీ గురించి గూగుల్ లో ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. ఒకవేళ అలా గూగుల్ లో వీటిని గురించి వెతికితే మీ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసి, దాని ద్వారా మిమ్మల్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది.ఇంకా గర్భ స్రావం గురించి కానీ, అది ఎలా జరుగుతుందని కానీ గూగుల్లో ఎప్పుడు వెతకకూడదు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాలో అబార్షన్ కు సంబంధించిన చట్టంలో చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. ఆ కంటెంట్ ను చూడడం కూడా నేరమే. వీటికి సంబంధించి కొన్ని ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీని గురించి భారత ప్రభుత్వం కఠినమైన రూల్స్ ను రూపొందించింది. కాబట్టి గూగుల్ లో దీని గురించి అసలు వెతుకకూడదు. అలా సెర్చ్ చేసినట్లయితే ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయవచ్చు.
Also Read: ”వాట్సాప్” కి డబ్బులు ఎలా వస్తాయి..? మీకు తెలుసా..?