Ads
భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అంటారు. కానీ కొన్ని సందర్భాలలో అన్ని విషయాలు చెప్పినప్పటికీ అవతలి వారు వాటిని సరిగా తీసుకోకపోతే క్రమేపి అవే మీ కాపురాల్లో కలతలకు కారణం అవుతాయి. మూడో మనిషి ద్వారా తెలుస్తుందేమో అన్న భయంతో చాలా సందర్భాలలో ఆడవారు లేక మగవారు ఇంతకుముందు తమకు ఉన్న పరిచయాల గురించి ప్రేమ వ్యవహారాల గురించి తమ జీవిత భాగస్వామితో డిస్కస్ చేయడం మంచిది అనుకుంటారు.
ఇది మంచిది కూడా కానీ అవతల వారు దీన్ని సరిగ్గా తీసుకోకపోతే జీవితంలో జరిగే ప్రతి చిన్న పనికి విషయానికి మీ గతంలో జరిగిన ఇన్సూరెన్స్ ని ఉదాహరణలుగా చెప్పి లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి పూర్తిగా అంచనా వేయకముందే మీ గురించి మీరు అన్ని చెప్పడం అంత మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు.
Ads
కానీ కొన్ని సందర్భాలలో ఇలా చెప్పడం వల్ల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు. మరికొన్ని సందర్భాలలో చెప్పడమే మహా పాపం అన్నట్లు అవతల వాళ్ళు మన చుట్టూ ఉన్న పరిస్థితులను సృష్టిస్తారు. దీంతో చెప్పడం మంచిదా? చెప్పకపోవడం మంచిదా? అన్న విషయం ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
అయితే పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాల విషయంలో ముఖ్యంగా మనతో పాటు ఇన్వాల్వ్ అయిన మనిషి యొక్క స్వభావాన్ని బట్టి మన భాగస్వామికి వాటి గురించి చెప్పడం చెప్పకపోవడం ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మనం ప్రేమించిన వ్యక్తి గురించి తెలియడం వల్ల పెద్ద ప్రమాదం లేదు అతని మనకు ఎటువంటి కీడు తలపెట్టడు అనుకున్నప్పుడు అసలు ఆ ప్రస్తావన తేకపోవడమే మంచిది. అలాకాకుండా అతను భవిష్యత్తులో మనకు ఏదైనా సమస్య తెస్తాడు అనుకుంటే మాత్రం ముందుగానే మీ జీవిత భాగస్వామితో వీటి గురించి మాట్లాడడం మంచిది అని నిపుణులు అంటున్నారు.