ఈ విషయంలో తన తండ్రి చెప్పినా తగ్గేదే లేదు… అంటున్న చిరంజీవి పెద్ద కూతురు..

Ads

ఆరుపదుల వయసులో కూడా వరుస ప్రాజెక్టులతో కొడుకుకి కాంపిటీషన్ వస్తు బాగా బిజీగా ఉన్న నటుడు మెగాస్టార్. అయితే తన కుటుంబ సభ్యులు నిర్మించిన సినిమాలు మాత్రం చిరంజీవికి ఎందుకో అచ్చి రావడం లేదు. అవి ఊహించిన ఫలితాలను ఇవ్వలేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తండ్రి తో ఒక సినిమా నిర్మించాలని ఆశపడుతోందట.

అంతేకాకుండా ఇది చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ హిట్ అవ్వాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మరియు కళ్యాణ్ కృష్ణ కాంబోలో రాబోయే సినిమాకు నిర్మాతగా సుస్మిత వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి మూవీ అంటే నిర్మాతలకు కొదవ ఏముంది.. అందుకే తాజాగా మరొక ప్రముఖ బ్యానర్ సుస్మిత బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్. అంతేకాదు ఖర్చు మొత్తం తామే భరిస్తామని సుస్మితకు లాభాల్లో వాటా ఇస్తామని ఆ బ్యానర్ నిర్మాతలు చిరంజీవికి చెప్పినట్లు ఓ చిన్ని గాసిప్ కూడా ఉంది.

Ads

ఎటువంటి రిస్క్ పడకుండా లాభాలతో పాటు మంచి పేరు కూడా వచ్చే ప్రతిపాదన కావడంతో చిరంజీవి దీన్ని సుస్మిత ముందుకు తీసుకురావడం జరిగిందట. కానీ సుస్మిత మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి రమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్ల వరకు ఉంది, ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్ రేంజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదే లేదు.

తేలికగా వచ్చే ఇటువంటి ఆఫర్స్ కంటే కూడా తన వంతు కష్టపడి పేరు తెచ్చుకోవడం ముఖ్యమని సుస్మిత భావించడం చిరంజీవికి కూడా నచ్చింది. నేను మా నాన్నతో నిర్మించబోయే ఫస్ట్ సినిమా ఇది…కాబట్టి ఇందులో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నేనే భరిస్తాను.. అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పడమే కాకుండా అంత పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ఈ విషయంలో తండ్రి ఎంత చెప్పినా తన డిసిషన్ మార్చుకునేది లేదని సుస్మిత కన్ఫామ్ చేసిందట.

Previous articleభార్యాభర్తల మధ్య పొరపాటున కూడా డిస్కస్ చేసుకోకూడని విషయాలు ఇవే…
Next articleబాల‌య్య‌, చిరంజీవి గురించి అప్పట్లో ఎన్టీఆర్ ఇలా అన్నారా..? నిజమైందిగా మరి..!