Ads
పెళ్లి తర్వాత ఎవరి జీవితమైనా సరే మారిపోతూ ఉంటుంది. చాలా మంది ఆడపిల్లలు పెళ్లి తర్వాత ఎన్నో మార్చుకోవాల్సి వస్తుంది. జీవితంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. పెళ్లి ముందు పెళ్లి తర్వాత ఒకేలా ఉండదు. అయితే పెళ్లయిన ఒక ఆడపిల్ల ఇలా ఉత్తరం తన తల్లి కి రాసింది.
ఈ ఉత్తరాన్ని మీరు చూస్తే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అందరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూడొచ్చు.
ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. అలానే నేను కూడా అందరి ఆడపిల్లలానే కలలు కన్నాను అమ్మా అని ఆమె రాయడం మొదలుపెట్టారు. జీవితాంతం నాకోసం వచ్చే రాజకుమారుడుతో ఆనందంగా ఉంటానని ఊహించానని… వివాహమైన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే పెళ్లి అనేది ఒక పూల పాన్పులా ఉండదని… నేను ఊహించిన దాని కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉందని ఆమె ఈ లేఖలో రాసారు. అలానే బాధ్యత, త్యాగాలు ఇలా చాలా ఉన్నాయని ఆమె రాశారు. ఇదివరకులా నాకు నచ్చినప్పుడు నిద్ర లేవలేను అందరికంటే కూడా ముందు లేచి కావాల్సిన పనులన్నీ చేయాలని.. ఆమె తన తల్లికి ఒక లేఖ ద్వారా చెబుతున్నారు.
Ads
మన ఇంట్లోలా ఇక్కడ ఉండలేమని.. బట్టలు విషయంలో కూడా ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అక్కడ పద్ధతులు ఇక్కడ పనికిరావని ఆమె రాశారు. ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేనని ఎవరు ఏం చెప్పినా చేయాలని రాశారు. పైగా అందరి అవసరాలు తీర్చడం నా బాధ్యత అని ఆమె ఈ లేఖలో తన తల్లికి చెప్పారు. ప్రతిక్షణం హుషారుగా ఉండలేనని.. ఉత్సాహంగా ఉండలేనని ఎవరికి ఏం కావాలన్నా చేయాలని రాసారు. అక్కడ నన్ను మీరు ఎంతో జాగ్రత్తగా నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు ఇప్పుడు అలా లేదు. ఒక్కొక్కసారి ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఏడుపు వస్తోందని నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉంటే బాగుండేది అని ఆమె రాశారు.
ఒకసారి ఇంటికి వచ్చి నీ చేతి వంట వండించుకుని తినాలని అనిపిస్తోందని.. కానీ నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఇంటి పేరుని మార్చుకుని ఇల్లును మార్చుకునే ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా అని అనిపిస్తుంది. అయితే నీవు ఎలా అయితే మా అందరికీ ఆనందాన్ని, శాంతిని, సౌకర్యం ఇచ్చావో నేను కూడా ఇప్పుడు అలానే అందించాలని గుర్తుకువస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను కూడా పూర్తిగా నీలా మారిపోతాను ఈ కొత్త కుటుంబం ప్రేమని తెలుసుకుంటాను. నా బాధ్యతని నేను సక్రమంగా చేస్తాను. అయితే ఇవన్నీ చేయగలిగే సామర్థ్యాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మ.