11 నెలల తర్వాత OTT లోకి వచ్చిన సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?

Ads

సాధారణంగా ఏదైనా ఒక సినిమా డిజిటల్ రిలీజ్ ఆ సినిమా విడుదల అయిన మూడు, నాలుగు నెలలలోపు అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల అయిన 11 నెలల తర్వాత డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పేరు జరా హట్కే జరా బచ్కే. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ సినిమాకి, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా అలీ ఖాన్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇల్లు కోసం వాళ్లు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

movie that released after many months

సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతుంది. సినిమా మొత్తం కూడా కామెడీ ఉండేలాగా చూసుకున్నారు. చాలా చోట్ల కామెడీ కూడా నవ్వు తెప్పించే విధంగానే ఉంటుంది. సినిమా మొత్తంలో అందరి పర్ఫార్మెన్స్ లు బాగున్నా కూడా హీరోయిన్ సారా అలీ ఖాన్ నటన మాత్రం కాస్త అతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. తెలుగు వారు కూడా ఈ సినిమా పాటలు చాలా సార్లు విన్నారు. ఈ సినిమా ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. కానీ ప్రీమియం మెంబర్ షిప్ ఉంటేనే సినిమా చూసే అవకాశం ఉంది.

Ads

ఈ సినిమా కోసం చాలా నెలల నుండి అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా రావడమే మంచి విషయం అని అనుకుంటున్నారు. ప్రీమియం కేవలం ఒక పరికరంలో మాత్రమే చూడాలి అనుకుంటే నెలకి 29 రూపాయలు చెల్లించాలి. నాలుగు పరికరాల్లో ప్రీమియం ఉపయోగించుకోవాలి అనుకుంటే 89 రూపాయలు చెల్లించాలి. ఈ ధరకు ఈ సినిమా అందుబాటులో ఉంది. సినిమాలో లొకేషన్స్, వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. సగటు సాధారణ ఇళ్లల్లో జనాలు ఎలా ఉంటారో ఈ సినిమాలో వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. సొంత ఇల్లు ఉండడం అనేది సామాన్యుడి కల. ఆ కల కోసం సామాన్యుడు ఎంత దూరం అయినా కష్టపడతాడు. అదే ఈ సినిమాలో చూపించారు.

Previous articleచట్టం ప్రకారం… విడాకుల తర్వాత మహిళలకి లభించే హక్కులు..!
Next article”నీ దగ్గరకి వచ్చేసి హాయిగా ఉండాలని వుంది కానీ”… అంటూ కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి రాసిన లేఖ..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.