Ads
అనంత్ అంబానీ పెళ్లి జామ్ నగర్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి దృష్టి ముఖేష్ అంబానీ పెళ్లిపై పడింది. అప్పట్లో వారి పెళ్లి ఎలా జరిగింది, సంబంధం ఎవరు కుదిర్చారు అంటూ అనేక సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పెళ్లి ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. పెళ్లి కాకముందు నీతా పేరు నీతా దలాల్. అప్పుడు ఈమె ఒక స్కూల్లో టీచర్ గా పని చేసేవారు. నీతా కు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం.
పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. ఒకసారి నీతా డాన్స్ ప్రోగ్రాం కి కోకిల బెన్ అటెండ్ అయ్యారు. ఆమెను నాట్యం చూసి ముగ్దురాలైన కోకిలబెన్ నీతాని తన ఇంటికోడల్ని చేసుకోవాలి అనుకున్నారు. అదే విషయాన్ని భర్తకు చెప్పారు. వెంటనే ధీరుభాయ్ అంబానీ నీతా తండ్రికి ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త తనకి ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముందు షాక్ అయ్యారంట నీతా తండ్రి.
Ads
నీతా కూడా మొదట్లో ఈ పెళ్ళికి ఒప్పుకోవటానికి సందేహించారంట. కానీ తర్వాత అంబానీతో పెళ్లికి అంగీకరించారు. అయితే పెళ్లికి ఒక కండిషన్ పెట్టారంట నీతా. అదేమిటంటే పెళ్లయ్యాక కూడా తను టీచర్ గా పని చేయాలనుకుంటున్నట్లు ముఖేష్ కి చెప్పారంట, అందుకు ముఖేష్ ఒప్పుకున్న మీదట పెళ్లి జరిగిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా నీతా అంబానీ చెప్పటం విశేషం.
పెళ్లి తర్వాత కూడా ఆమె నెలకు 800 రూపాయల జీతంతో టీచర్ గా జాబ్ చేశారు. తర్వాత కొద్ది రోజులకే ఆ జాబ్ మానేసి ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించారు. ఇప్పుడు ఈ స్కూల్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూల్. షారుక్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్ ఇలాంటి వీఐపీల పిల్లలందరూ ఈ స్కూల్ లోనే చదువుతున్నారు.