ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా..? ఎంత మారిపోయాడో కదా..?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయ్యారు. మొన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కొన్ని స్టిక్కర్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ స్టిక్కర్స్ తమ బండ్లకి అంటించుకుందామని చాలా మంది తయారు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాక అందరూ స్టిక్కర్స్ బండ్లకి అంటించుకోవడం మాత్రమే కాకుండా పోస్టర్స్ కూడా పెడుతున్నారు. దీని మీద సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తున్నారు.

boy behind pawan kalyan

దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య అనా పవన్ కళ్యాణ్ కి హారతి ఇచ్చారు. ఆమె బయటికి వచ్చి అందరికీ థాంక్యూ చెప్పారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, అనాతో పాటు మరొక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు చాలా మారిపోయాడు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అతను పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్. అకిరా ఎక్కువగా బయటికి రాడు. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కానీ తన తండ్రి గెలిచిన సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి అకిరా కూడా వచ్చారు.

Ads

అకిరా కూడా ఇంటి బయటకు వచ్చి అందరికీ థాంక్యు చెప్పాడు. చాలా రోజుల క్రితం ఒకసారి పవన్ కళ్యాణ్ తో కలిసి అకిరా కనిపించాడు. మళ్లీ ఇప్పుడు బయటికి వచ్చాడు. మధ్యలో ఎప్పుడైనా రేణు దేశాయ్ ఏదైనా పోస్ట్ చేస్తే అందులో కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అకిరా చదువుకుంటున్నాడు. సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనేది ఇంకా తెలియదు.

సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉంటాడు. ఇంక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాల్లో రాణించడం మాత్రమే కాకుండా, మూడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇందులో రెండు సినిమాలు, రెండు భాగాలుగా రూపొందుతున్నాయి. అంటే మొత్తంగా ఐదు సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. మరి రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి ప్రముఖులు అందరు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

watch video :

Previous articleముకేశ్ అంబానీ కే కండిషన్ పెట్టిన నీతా అంబానీ.. ఆ ఒప్పందంతోనే జరిగిన పెళ్లి!
Next articleసిటీలో ఉండే అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడట్లేదా..? ఎందుకు ఒక వ్యక్తి ఏం చెప్పారో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.