Ads
ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుండి వరుస మ్యాచ్ లు గెలుస్తూ, సెమీఫైనల్ వరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో చతికిలపడింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరిన భారత జట్టు ఓటమికి గల కారణం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో 2003 వరల్డ్ కప్ ఫైనల్లో కెప్టెన్ గంగూలీ చేసిన తప్పే, ఇప్పుడు రోహిత్ శర్మ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టోర్నీ మధ్యలోనే హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం అయిన విషయం తెలిసిందే. హార్దిక్ లేని లోటు లీగ్ దశలో తెలియకుండా మిగతా ప్లేయర్స్ చేసినప్పటికీ, ఫైనల్ లో ఆరవ బౌలర్ లేని లోటు కనిపించింది. ఫైనల్ మ్యాచ్ లో ఆడే తుది జట్టులో సూర్య కుమార్ యాదవ్ లేదా సిరాజ్ లలో ఒకరి స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని సూచించారు. అయితే సూర్యను పక్కన పెడితే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది.
ఇక సిరాజ్‌ను పక్కన పెడితే ఇద్దరు పేసర్లతో ఆడాల్సి వస్తుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉంటే సూర్య స్థానంలో అతన్నే తీసుకునేవారు. టీమిండియా సారధి రోహిత్ శర్మ ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ లేకుండా ఫైనల్ మ్యాచ్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ పెద్దగా ఆడలేదు. 28 బాల్స్ కు 18 పరుగులు మాత్రమే చేశాడు. వాటిని అశ్విన్ సైతం చేసేవాడు. అయితే అతను బౌలింగ్‌లో యూజ్ అయ్యేవాడు.
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తీసుకుంటే, ఆసీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను, మ్యాచ్ విన్నర్ గా మారిన ట్రావిస్ హెడ్‌ను అశ్విన్ కట్టడి చేసేవాడనేని భావిస్తున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో గంగూలీ అనిల్ కుంబ్లేను పక్కనబెట్టి పెద్ద తప్పు చేశాడని, రోహిత్ కూడా అశ్విన్‌ను పక్కన పెట్టి అదే తప్పు చేశాడని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Ads
Kumble 2003
Ashwin 2023Conundrum of not playing India's goat spinners in a world cup final. #CWC2023Final
— Manish 💉💉💉 (@paap_singer) November 19, 2023
Also Read: నాకౌట్ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ ఫ్లాప్ అయింది “సూర్య” కాదు.. ఈ ఆల్ రౌండర్..!