సౌత్ ఇండియాలోనే అందరికంటే రిచ్ హీరో ఎవరో తెలుసా..? అసలు ఊహించి ఉండరు..!

Ads

సౌత్ సినీ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలు ఉన్నారు. వారిలో సీనియర్ స్టార్ కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి సీనియర్ హీరో పారితోషికం అత్యధికంగా తీసుకుంటున్న వారిలో ముందుంటారు.

Ads

ఆ తరువాత తరంలో విజయ్ దళపతి, అజిత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు ఆశ్చర్యపరిచే రీతిలో భారీ పారితోషికం తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో  అందరికంటే రిచ్ హీరో ఎవరు అనే న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొందరు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీకి రూ.110 కోట్లు అందుకున్నారని సమాచారం. ఇక రజినీకాంత్ ఆస్తి విలువ సుమారు 500 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి దాదాపు 130 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. కమల్ హాసన్ ’ఇండియన్ 2′ మూవీ కోసం రూ.150 కోట్లు తీసుకున్నటు తెలుస్తోంది.
టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ రూ.100 కోట్లు, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఒక్కో సినిమాకు సుమారు రూ. 80 కోట్ల వరకు పారితోషికాలు తీసుకుంటున్నారు. GQ (మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్) రిపోర్డ్ ప్రకారం, సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అక్కినేని నాగార్జున అని తెలుస్తోంది. వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలందరిని వెనక్కి నెట్టి, సౌత్ ఇండియాలో అందరికన్నా రిచెస్ట్ యాక్టర్ గా నాగార్జున మొదటి స్ధానంలో నిలిచారు. నాగార్జున నికర ఆస్తి విలువ రూ.3010 కోట్లు అని తెలుస్తోంది.
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా, ప్రొడ్యూసర్ గా, టెలివిజన్ హోస్ట్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు 9- 20 కోట్ల రూపాయల మధ్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సొంత ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియో ద్వారా ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తూ నాగార్జున బాగా సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌ బిజినెస్, ఇండియన్ సూపర్ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి టీమ్ కు సహ యజమానిగా కూడా ఉన్నారు. నాగార్జునకు హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ ఉంది.
ఆయన కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయన ఉండే బంగ్లా విలువ రూ.45 కోట్ల, కార్లు, ఒక ప్రైవేట్ జెట్ కూడా నాగార్జునకు ఉంది. రూ.3010 కోట్ల ఆస్తితో సౌత్ లో ఆయన రిచెస్ట్ హీరోగా నిలిచారు. రెండవ రిచెస్ట్ యాక్టర్ గా విక్టరీ వెంకటేష్, ఆయన ఆస్తి విలువ రూ.2200 కోట్లు. మూడవ స్థానంలో చిరంజీవి, ఆయన ఆస్తి విలువ రూ.1650 కోట్లు. ఆ తరువాతి స్థానంలో రామ్ చరణ్, ఆస్తి విలువ రూ.1370 కోట్లు. ఆ తరువాతి స్ధానాల్లో కోలీవుడ్ హీరో దళపతి విజయ్, యనగా టైగర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు ఉన్నారు.

Also Read: “మంగళవారం”లో జమీందారు భార్యగా నటించిన ఈమె ఎవరో తెలుసా.? బ్యాగ్రౌండ్ ఏంటంటే.?

Previous articleనాకౌట్ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ ఫ్లాప్ అయింది “సూర్య” కాదు.. ఈ ఆల్ రౌండర్..!
Next articleఅప్పుడు గంగూలీ చేసిన తప్పే.. ఇప్పుడు రోహిత్ చేశాడా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.