Ads
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ లని ఎంచుకుంటూ, సినిమాలు చేస్తున్న హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా కూడా సందీప్ కిషన్ మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అలాంటి ఒక సినిమాతోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆ సినిమానే ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈయన అంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా సినిమాలకి దర్శకత్వం వహించారు.
వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. సినిమా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో విడుదల అవుతోంది. కానీ ఫిబ్రవరి 14వ తేదీన కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. దాంతో ఈ సినిమా రివ్యూ ఇంకొంచెం ముందే వచ్చేసింది. సినిమా చూసిన వారు అందరూ కూడా సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు.
Ads
సందీప్ కిషన్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా దక్కింది అని అంటున్నారు. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి అని, అందులో కొన్ని తెలిసిపోయినా కూడా, కొన్ని మాత్రం అసలు ఊహించడం కష్టం అని అంటున్నారు. పాటలు బాగున్నాయి అని, ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ సినిమాని మరొక లెవెల్ కి తీసుకెళ్తుంది అని అంటున్నారు.ఆ సీన్ సినిమాకి హైలైట్ అని అన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోతుంది అని, అసలు కథ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది అంటూ ప్రేక్షకులు ఆల్రెడీ రివ్యూ ఇచ్చారు.
మరి రేపు సినిమా విడుదల అయ్యాక ఈ అంచనాలని సినిమా అందుకుంటుందో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అయితే ఇటీవల ఇలాంటి జోనర్ ఉన్న సినిమాలు రావడం ఎక్కువగా జరుగుతుంది. విరూపాక్ష కూడా ఇలాంటి క్యాటగిరీకి చెందిన సినిమా. కానీ అసలు ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు.
ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల క్రితం మొదలు అయ్యింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. మధ్యలో వేరే సినిమాల విడుదల ఉండడం వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఆ సమయాన్ని సినిమా బృందం ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకున్నారు. ఎన్నో షోస్ కి, ప్రోగ్రామ్స్ కి వెళ్లి సినిమాని ప్రమోట్ చేశారు.
ALSO READ : “సైడ్ క్యారెక్టర్” నుంచి… “హ్యాట్రిక్ హీరో” గా మారిన జోష్ సినిమా ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?