30కిపైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు పరిచ‌యం చేసిన వ‌న్ అండ్ ఓన్లీ షో ‘పాడుతా తీయగా’

Ads

 

పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్ప‌డిందంటే మామూలు విష‌యం కాదు. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం హోస్ట్‌గా ప్రారంభ‌మైన ఈ పాటల కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలో ముందుకు సాగుతోంది. ఈయ‌న‌తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్‌లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 1996లో ప్రారంభమైన ఈ సింగింగ్ షో ఎంతో మంది గాయ‌నీ గాయ‌కుల‌ను తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది.

Ads

* పాడుతా తీయ‌గా ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 30కిపైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అందులో కొంద‌రు టాప్ సింగ‌ర్స్‌లో కొన‌సాగుతోన్నారు.
* సింగ‌ర్ ఉషా, గోపిక పూర్ణిమ పాడుతా తీయ‌గా ద్వారానే వెలుగులోకి వ‌చ్చారు. ఉష తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో క‌లిపి వెయ్యికిపైగా పాట‌లు పాడింది. గోపిక పూర్ణిమ ఐదు వంద‌ల పాట‌లు పాడ‌టం గ‌మ‌నార్హం.
* తెలుగులో ఎన్నో మ‌ధుర‌మైన పాట‌ల‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించిన కౌస‌ల్య కూడా పాడుతా తీయ‌గా ద్వారానే సింగ‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
* నిత్య సంతోషిణి, లిప్సిక‌, దామిని భ‌ట్ల‌, మ‌నిషా ఎర‌బ‌త్తిని, సాహితి చాగంటి, హ‌రిణి ఇవ‌టూరి, స్మిత‌, శ్రీల‌త కూడా పాడుతా తీయ‌గా ద్వారా పాపుల‌ర్ అయ్యారు. సినిమాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకున్నారు.
* తెలుగులో ఎనిమిది వంద‌ల‌కుపైగా పాట‌లు పాడిన సింగ‌ర్ హేమ‌చంద్ర పాడుతా తీయ‌గానే లైఫ్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న అనురాగ్ కుల‌క‌ర్ణి, మ‌ల్లిఖార్జున్‌లు పాడుతా తీయ‌గా ద్వారానే అవ‌కాశాల్ని అందుకున్నారు.


* ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ కారుణ్య కూడా పాడుతా తీయ‌గాలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అత‌డితో పాటు సందీప్‌, పార్థు, రోహిత్ ఈ సింగింగ్ షో ద్వారానే మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు చేరువ‌య్యారు.

Previous articleతెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తోన్న ‘జబర్దస్త్’
Next articleతెలుగు సినీ ఇండ‌స్ట్రీకి న్యూ టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తూ దూసుకెళ్తోన్న ‘ఢీ’
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.