ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి.. పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన తెలుగు హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Ads

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనె కాకుండా ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తమ అభిమాన హీరోలకు సంబంధించిన ఏ వార్త అయిన సరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు.

తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

పైన ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తూ, అంతర్జాతీయంగా పాపులర్ అయ్యారు. ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినా, ఒదిగి ఉండే గుణం మరియు అందరితో ప్రేమగా ఉంటూ ప్రత్యేకతను చాటుతున్నాడు. ఆరడుగుల ఎత్తుతో, కండలు తిరిగిన శరీరంతో తెర పై మీద కనిపిస్తే చాలు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అతనేవరో కాదు ఫ్యాన్స్ ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్

Ads

గతంలో తెలుగులో ఎంత పెద్ద హీరో అయినా, ఇతర రాష్ట్రానికి వెళ్లిన సమయంలో తన గురించి,  ట్రాక్‌ రికార్డ్‌ గురించి చెప్పుకొవాల్సిన కండిషన్ ఉండేది. అయితే ఆ పరిస్థితిని బాహుబలి సినిమాలతో ప్రభాస్‌ మార్చేశాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్, ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ తో బాలీవుడ్ లో తన క్రేజ్‌ మరింత పెంచుకున్నాడు.ఈ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చైనా, థాయిల్యాండ్, జపాన్ వంటి దేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మూవీ రిలీజ్ అంటే, ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ అయిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్ళు సాధించిన సలార్ మూవీ ఓటీటీలోను విశేష స్పందన పొందుతోంది.

Also Read: 30 ఏళ్ల క్రితమే.. చిరంజీవి సినిమా టిక్కెట్ ధర ఎంత రేంజ్ కి వెళ్లిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్..!

Previous articleవిడాకులు తీసుకున్న మహిళ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుందా..? ఆకాశం నీ హద్దురా హీరోయిన్ నటించిన ఈ సినిమా చూశారా..?
Next articleఇది ఒక సింగర్ చిన్నప్పటి ఫోటో..! ఎవరో గుర్తుపట్టారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.