Ads
సినీ ఇండస్ట్రీలో గుర్తింపు అనేది ఊహించినంత సులభంగా ఎవరికి దక్కదు.. కొందరికి ఒకే ఒక సినిమాతో స్టార్డం వస్తే, టాలెంట్ ఉన్నప్పటికీ మరికొందరికి గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కాలం పడుతుంది.
అయితే ప్రస్తుతం బుల్లితెర మోస్ట్ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ పుణ్యమా అని చాలామంది చిన్న చిన్న స్టార్స్ కి మంచి గుర్తింపు దక్కింది. పదిమందిలో తమను తాము నిరూపించుకోవాలి అనుకునే ఎందరో చిన్న చిన్న సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది.
ఇప్పటికే ఆరు సీజన్లో పూర్తిచేసుకుని నిన్న ఏడవ సీజన్ ప్రారంభించిన బిగ్ బాస్ షో పుణ్యమా అని ఇప్పటికే ఎందరో చిన్న తరహా నటులు షో పూర్తయ్యాక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మంచి ఆఫర్లు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బిగ్బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్…ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ఇంత అందమైన అమ్మాయి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుందబ్బా అంటూ నటిజెన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు మరి.
చలాకీగా ఉండే రతిక వచ్చి రాగానే అందరికీ స్ట్రోక్ లు ఇచ్చే నాగార్జునకి హాట్ స్ట్రోక్ తెప్పించింది. వచ్చి రావడంతోటే నాగార్జునతో పులిహోర కలిపిన ఈ పాప ఎవరు అని ప్రస్తుతం ఆన్లైన్ లో సర్చ్ జరుగుతుంది. 2016 ముందు కేవలం ఒక స్టాండర్డ్ కమెడియన్ గా రతిక తన కెరియర్ను స్టార్ట్ చేసింది. అయితే అప్పట్లో ఆమె పేరు ప్రియా…పటాస్ తో తన ప్రయాణం మొదలుపెట్టి ఏడాది వరకు కామెడీ షో లో జనాలను నవ్విస్తూ వచ్చింది.
Ads
watch video:
ఆ తర్వాత ఆ షోలో కనిపించలేదు సరి కదా తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు. తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు మోడల్ గా వచ్చి ఫుల్ టైం బిజీ అయిపోయింది ఈ భామ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పోస్టులు పెడుతూ ఏకంగా 133 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది.
ఇక చివరిగా బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే నిన్న బిగ్ బాస్ షోలో చంకీల అంగీలు వేసి అనే పాటకు స్టెప్పులు వేసుకుంటూ ఎంటర్ అయిన ఈ భామపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందరో ఔత్సాహికల కన్ను ఉంది. ఇక బిగ్ బాస్ లో ఫ్యాన్ వేస్ ఏర్పరచుకుంటే ఎటువంటి హంగామా చేస్తుందో చూడాలి.
ALSO READ : స్కంద సినిమాలో “రామ్ పోతినేని” స్థానంలో మొదటిగా అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే..?