“నా నవ్వులో నిన్ను గుర్తు చేసుకుంటా..!” అంటూ… పవిత్ర జయరాం చివరి పోస్ట్..! కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Ads

సీరియల్ నటి పవిత్ర జయరాం తెలియని తెలుగువారు ఉండరు. త్రినయని అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు నటి పవిత్ర జయరాం. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో పవిత్ర నటిస్తున్నారు. పవిత్ర స్వతహాగా కన్నడ వారు. తెలుగు సీరియల్స్ లో అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా సీరియల్స్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ లో మొదటిసారిగా పవిత్ర నటించారు. ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలు అయ్యాయి.

pavitra jayaram last reel

పవిత్ర కన్నడలో రోబో అనే సీరియల్ కూడా చేశారు. ఆ తర్వాత తెలుగులో సీరియల్స్ చేస్తూ వచ్చారు. త్రినయని అనే సీరియల్ ద్వారా పవిత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిపోయారు. జీ తెలుగులో ప్రసారం అయ్యే త్రినయని సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. దాంతో సీరియల్ లో నటించిన వాళ్లందరికీ కూడా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని సీరియల్ లో నటించిన క్యారెక్టర్ పేర్లతోనే గుర్తుపట్టి పిలిచేవారు.

హీరోయిన్ నుండి సహాయ పాత్రలో నటించే వాళ్ళతో పాటు అందరూ ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిపోయారు. ఇదే సీరియల్ లో పవిత్ర నటించారు. పవిత్ర కి కూడా ఈ సీరియల్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్రని తన పాత్ర పేరుతోనే పిలిచేవారు. అంతగా ఫేమస్ అయిపోయారు.

పవిత్ర ఇటీవల తన చివరి శ్వాస విడిచారు. ఎంతో మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పవిత్ర చనిపోయే కొద్ది రోజుల ముందు సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ షేర్ చేశారు. అందులో పవిత్ర, సీరియల్ లో తన సోదరుడిగా నటించిన చంద్రకాంత్ గురించి కొన్ని రీల్స్ చేశారు. చంద్రకాంత్, పవిత్ర ప్రేమలో ఉన్నారు అని ఇవి చూస్తే అర్థం అవుతోంది. ఒకరిలో పవిత్ర చంద్రకాంత్ తో కలిసి నడుస్తూ ఉన్నారు. ఆ రీల్ షేర్ చేసి, “రెండు హృదయాలు. కానీ ఒకటే ఊపిరి” అని రాశారు. అప్పుడే వీళ్లిద్దరూ జంట అనే విషయం ఇంకా ఎక్కువ మందికి తెలిసింది.

అంతకుముందు ఒక కన్నడ పాటకి రీల్ షేర్ చేసి, “నా నవ్వులో నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను” అని చంద్రకాంత్ ని ఉద్దేశించి వీడియో షేర్ చేశారు పవిత్ర. గతంలో కూడా చంద్రకాంత్ తో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేశారు. పవిత్ర గత నెల అంటే ఏప్రిల్ 14వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో చాలా మంది పవిత్ర కి విషెస్ చెబుతూ పోస్ట్ లు షేర్ చేశారు. త్రినయని సీరియల్ లో నటించిన వారు కూడా పవిత్ర ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Previous articleఅక్క భర్త ఇలాంటి వాడైతే… ప్రేమకి అడ్డుపడితే…? ఈ సినిమా చూశారా..?
Next articleఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఎలా ఫ్లాప్ చేశారు..! ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.